ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని పాటించదగిన సలహాలు
ఆరోగ్యం Health : నాకు తెలిసిన నేను పాటించే కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. వేళకి తినండి నిద్రపోండి అన్ని పోషకాలు గల సమతుల ఆహారం తీసుకోండి. ఉదయం పూట నడక మరియు వ్యాయామం తప్పనిసరిగా చేయండి.వారానికి కనీసం నాలుగు రోజులైనా ధ్యానం చేయండి. అన్నింటికీ మించి పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేసుకోండి.
1.సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవటం ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగటం చాలా మంచిది కుదిరితే గ్రీన్ టీ తీసుకుంటాను.
2. కొద్దిసేపు యోగ లేదా వాకింగ్ లాంటివి చేయాలి.మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
3. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి నూనె పదార్తలు తీసుకోక పోవటం మంచిది. ఏదన్నా వెజిటేబుల్స్ సలాడ్ ఇంకా లైట్ గ డైజెస్ట్ అయ్యేవి తినాలి.
4. చెడు విషయాలకి దూరంగా ఉండటం చాలా మంచిది. మనకి చెడు చేసే వారికి కూడా దూరంగా ఉండాలి.
5. కాలక్షేపం కోసం ఏదన్నా బుక్స్ చదివితే టైం పాస్ అవుతుంది. నేను అయితే డ్రాయింగ్ వేస్తాను. నా మూడ్ రిఫ్రెష్ అవుతుంది నాకు నచ్చిన పని చేస్తాను కాబట్టి.
6. అప్పుడప్పుడు దగ్గర్లో ఉన్న గుడికి వెళ్తుంటాను. చిన్న చిన్న అనారోగ్యాలకి భయపడి ఏది పడితే ఆ టాబ్లెట్స్ వాడకూడదు డాక్టర్ సలహా లేకుండా.
7. ఇంకా నాకు ప్రకృతి ని ఎంజాయ్ చేయటం అంటే చాలా ఇష్టం. నేను పుట్టి పెరిగింది తిరుపతి కనుక ఇక్కడ పచ్చనైనా ప్రకృతికి ఎలాంటి కొదవ లేదు. వీలు కుదిరినప్పుడల్లా తిరుమల కి వెళ్ళిపోతుంటాను.
8.ఇవి కాకుండా ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాను మాంసాహారం అసలు తీసుకోను నేను ప్యూర్ వెజిటేరియన్ని ఖాళీ సమయాల్లో డిఫరెంట్ వెజ్ రెసిపీస్ ట్రై చేస్తూ వుంటాను.
9. నైట్ ఎలాంటి ఆలోచనలు లేకుండా త్వరగా నిద్రపోతాను.
10. ఇవేనండి నాకు తెలిసిన ఆరోగ్య సలహాలు , జాగ్రత్తలు.కుదిరితే మీరు కూడా ఫాలో అవండి.