న్యాయం చేయాలంటూ విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : నీట్ - యూజీ ప్రవేశపరీక్ష 2024’లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. బిహార్‌లో ఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీకైనట్లు వార్తలు రాగా కేంద్ర ప్రభుత్వం, నేష నల్ టెస్టింగ్ ఏజెన్సీ వార్తల ను ఖండించింది. అయితే, పేపర్ లీక్ నిజమేనని తాజాగా బయటికొచ్చింది. పరీక్ష ముందు రోజు రాత్రే నీట్ క్వశ్చన్ పేపర్ తమకు అందిందని బిహార్‌లో అరెస్ట యిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీక రించడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బిహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజినీర్‌తో పాటు ముగ్గురు నీట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరిలో ఓ అభ్యర్థి జూనియ ర్ ఇంజినీర్‌కు స్వయానా మేనల్లుడు కావడం గమనార్హం.
రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కు ప్రిపేర్ అవుతున్న తనకు తన మామయ్య ఫోన్ చేసి పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశానని, ఇంటికి రమ్మని పిలిచారని సదరు అభ్యర్థి పోలీసులకు తెలిపారు.నీట్ పరీక్ష మే 5 తేదీకి ఒక రోజు ముందు అంటే మే 4వ తేదీ రాత్రి తన స్నేహితుల ను తీసుకుని మామయ్య వద్దకు వెళ్లానని.. అక్కడ తనకు నీట్ ప్రశ్నపత్రం, ఆన్సర్ షీట్ ఇచ్చారని తెలిపారు.రాత్రంతా వాటిని తాము బట్టీపట్టి మరుసటి రోజు పరీక్షా కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నపత్రాన్ని చూస్తే.. ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్‌తో పూర్తిగా మ్యాచ్ అయ్యిం దని ఆ నీట్ అభ్యర్థి పోలీసులకు వెల్లడించాడు.పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విద్యార్థులకు అన్యాయం చేయొద్దంటూ రోడ్డెక్కారు. తక్షణమే సిబిఐతో విచారణ జరిపించాలంటూ అభ్యర్థు లు కోరుతున్నారు.