ఎక్మాయి గ్రామంలో ఆలయ భూముల వేలం
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో శ్రీ మారుతి దేవాలయం భూములను ఆశాఖ అధికారులు సోమవారం కౌలుకు వేలం వేశారు. స్థానిక ఆలయానికి సంబంధించి సర్వే నంబర్ 116/1లో 8.06 ఎకరాలు, సర్వే నంబర్ 116/2లో 3.14 సర్వే నంబర్ 150-1 లో 0.16 గుంటలు సర్వే నంబర్ 150/2లో 1.05 ఎకరాలు మొత్తం కలిపి 13.01 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గ్రామ పెద్దల సమక్షంలో బహిరంగ వేలంతో కౌలుకు ఇచ్చేందుకు అధికారులు సమావేశం నిర్వహించారు. దేవదయ శాఖ పోలేపల్లి ఎల్లమ్మ దేవస్థానం మేనేజర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలం జరపగా స్థానికుడు శామప్ప రూ.16,500 ఆలయ భూమిని కౌలుకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ శాఖ మండల ఇన్చార్జి టి.నరేందర్, జూనియర్ అసిస్టెంట్ శ్యామ్ కుమార్, గ్రామ పెద్దలు పి.శ్రీనివాస్ రెడ్డి, ఎ.సుదర్శన్ బి.శ్రీనివాస్ గౌడ్, ఎం.సాయి రెడ్డి బి.వెంకట్ రెడ్డి, ఎం.మధు, పి.నర్సప్ప, సుల్తాపూర్ రాములు, పీ.మునిప్రకాష్ రెడ్డి, అడికే శామప్ప, భీమప్ప తదితరులు పాల్గొన్నారు.