ఇవ్వాళ టెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ ఫలితాలు ఇవ్వాళ విడుదల కానున్నాయి. టీజీపీఎస్సీ మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు నిర్వహించగా.. పేపర్ పార్ట్-1కి 85,996 మంది, పేపర్ పార్ట్-2కు 1,50,491 మంది అభ్యర్థులు హాజరయ్యారు. TET పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులు I నుండి V తరగతి వరకు బోధించే STG పోస్టులకు అర్హులు. పేపర్-2లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. కాగా tstet2024.aptonline అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలను చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా టీఎస్ టెట్ ర్యాంక్ కార్డును ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.