చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
* ఆటలో గెలుపు, ఓటములు సహజమే ఎమ్మెల్యే
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ బాలుర పాఠశాల ఆవరణలో ఆసిఫ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ గత వారం రోజులుగా నిర్వహించారు. ఈ పోటీల్లో చివరిగా ఆర్మన్ లెవెల్ జట్టు విజయం సాధించగా, బాజీగర్ జట్టు రన్నర్ గా నిలిచింది. ఈ విజేతలకు బహుమతులు అందించేందుకు మంగళవారం జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల ఆవరణంలో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సమావేశానికి వచ్చిన ఆయన ఈ రెండు జట్లకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు అనంతరం ఈ రెండు జట్లకు గాను 25 వేల బహుమతిగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకోవడమే కాకుండా విద్యతోపాటు క్రీడల్లోను ప్రతిభ సాధించి అత్యున్నత స్థానానికి ఎదగాలని అన్నారు. ప్రపంచంలో క్రికెట్ ఎంత విలువ ఉందో మీకు తెలుసు అని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరు క్రీడల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కలల్ నరసింహులు, శంకరప్ప, లక్ష్మణరావు, మాధవరెడ్డి, యువకులు క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.