విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం భోజ్యా నాయక్ తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని భోజ్యా నాయక్ తాండకు చెందిన గోపాల్ నాయక్ కొడుకు శ్రీనివాస్ (20) తాండూరులోని శాలివాహన డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం శ్రీనివాస్ తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిపోగా, డిగ్రీ పరీక్షలు ఉన్నాయని చదువుకోవడానికి శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అదే తాండాలో వారు నిర్మిస్తున్న కొత్త ఇంటికి అవసర నిమిత్తం కరెంటు మోటర్ మోటర్ ను బిగించి నీరు పడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కింటి వారు వచ్చి చూడగా మిగతాజీవిగా పడి ఉన్నాడు. యువకుడి మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.