రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుండి దూకిన యువతి
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ జిల్లాలోని ఘట్కేసర్ పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్ వంతెన పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.విద్యార్థిని వంతెనపై నుంచి దూకిన విషయాన్ని తెలుసు కున్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఖయ్యూం మోటార్ సైకిల్ పై ఘట్కేసర్ కమ్యూనిటీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
విద్యార్థిని ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామం పరిధిలోని వీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న భాష పాక నాగమణిగా(19) గుర్తించారు.ఘట్కేసర్ కమ్యూనిటీ ఆసుపత్రి వైద్యులు నాగమణికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.