గ్రూప్ 1 అభ్యర్థులకు కీలక అప్డేట్
తెలంగాణ telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 1:100 ప్రాతిపదికన ఎంపిక చేయా లని అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు.ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ Congress Party ఇచ్చిన హామీని నిలుపు కోవాలని అభ్యర్ధులు కోరుతున్నారు.అయితే ప్రభుత్వం ఏమాత్రం వీరి విన్నపాలను పట్టించుకోవడం లేదు. మెయిన్స్‌కు జీవో (నం.55, 29)లలో ని నిబంధనల ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీ ఎస్సీ తేల్చి చెప్పింది.ఈ మేరకు మెయిన్స్ పరీక్షకు అభ్యర్థు ల్ని 1:50 నిష్పత్తి లోనే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది.
మెయిన్స్ పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్ 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయడం సాధ్యం కాదని చేతులెత్తేసింది.ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్సీ TGPSC మెమో జారీచేసింది.మరోవైపు ప్రభుత్వం స్పందించకపోతే రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు, నిరాహారదీక్షలు చేస్తామని ఉద్యోగాల కోసం నిరుద్యోగులు హెచ్చరించారు.దీనిలో భాగంగా రేపు (శుక్రవారం) టీజీపీఎస్సీ TGPSC ముట్టడికి పిలుపునిచ్చారు.డిమాండ్లు నెరవేర్చేందుకు గురువారం వరకు గడువని అల్టిమేటం జారీ చేశారు.ఆలోపు ప్రభుత్వం దిగిరాకుంటే నిరుద్యోగుల ధర్నాతప్ప దని హెచ్చరిస్తున్నారు.