13 నెలల వ్యాలిడిటీతో BSNLలో కొత్త ప్లాన్ ధర ప్రయోజనాలివే
జాతీయ National News భారత్ ప్రతినిధి : ప్రభుత్వరంగ Govt, టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) దేశవ్యాప్తంగా 4జీ సేవలను 4G Services, ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లను తీసుకొస్తోంది. మరోవైపు ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ టారిఫ్లను పెంచిన విషయం తెలిసిందే. ఫలితంగా చాలామంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ ప్లాన్లపై (BSNL Recharge Plan) దృష్టి సారించారు. దీన్ని ఆసరాగా చేసుకొని 395 రోజుల వ్యాలిడిటీతో ఇటీవల బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.
కొత్త ప్లాన్ వివరాలు....
• ప్లాన్ ధర రూ.2,399. (అంటే నెలకు దాదాపు రూ.190)
• వ్యాలిడిటీ 395
• రోజుకు 2జీబీ డేటా
• రోజుకు 100 ఎసెమ్మెస్లు
• అపరిమిత కాలింగ్
• దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్
• జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరీనా గేమ్స్, గేమ్స్టన్ ఆస్ట్రోటెల్
బీఎస్ఎన్ఎల్ 365 ప్లాన్ దీనితో పాటు బీఎస్ఎన్ఎల్లో మరో 365 రోజుల 365 Days వ్యాలిడిటీతో దీర్ఘకాల ప్లాన్ (BSNL Recharge Plan) కూడా ఉంది. దీంట్లో ఎలాంటి రోజువారీ పరిమితి లేకుండా 600జీబీ డేటా 600GB Data, లభిస్తుంది. రోజుకు 100 ఎసెమ్మెస్లు ఉంటాయి. అపరిమిత కాలింగ్ పొందొచ్చు. దీంట్లోనూ జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హర్డీ గేమ్స్, ఛాలెంజర్ అరీనా గేమ్స్, గేర్ఆన్ ఆస్ట్రోటెల్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
జియో తన మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచిన విషయం తెలిసిందే. జులై 3 నుంచి కొత్త రేట్లు New Rates From 3rd July, అమల్లోకి వచ్చాయి. అదే బాటలో భారతీ ఎయిర్టెల్ టారిఫ్ ను 10-21 శాతం పెంచింది. వొడాఫోన్ ఐడియా కూడా మొబైల్ టారిఫ్లను జులై 4 నుంచి 11-24 శాతం 11-24 Percent From July, 4వరకు పెంచినట్లు ప్రకటించింది.