150 ఏండ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అడవి దున్న
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : నల్లమల అడవుల్లో 150 ఏళ్ల నుంచి కనిపించని అడవి దున్న ఇప్పుడు మళ్లీ మంగళవారం సాయంత్రం కనిపించింది. నెల రోజుల క్రితం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని గుర్తించారు అటవీ అధికారులు.వెంటనే వీడియో ఫొటోలు తీసిన సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. తాజాగా మళ్లీ వెలుగోడు రేంజ్ లో నిన్న సాయంత్రం అడవిదున్న కనిపించింది. నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ.ఇన్నేళ్ల తర్వాత అడవిదున్న కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయం అన్నారు.పెద్దపులులు ఏనుగులు వంటి భారీ జంతువుల సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడం సాధారణమే కానీ ఈ అడవి దున్న మైదానాన్ని దాటుకుని నల్లమలకు చేరి ఉంటుందని వెల్లడించారు.
మరిన్ని వార్తలకు.....
* ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* ఇక నుంచి ఆన్ లైన్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు ఇక్కడ క్లిక్ చేయండి
* సెల్ఫీ వీడియో తీసుకుని రైతు సూసైడ్ అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశం ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ల్యాప్ టాప్ లు పంపిణీ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో 213 మంది ఖైదీలను విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు ఇక్కడ క్లిక్ చేయండి