నీట్ యూజీ పరీక్షల లీక్ పై విచారణ 18 కీ వాయిదా
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : దేశవ్యాప్తంగా సంచలన కలిగించిన నీట్-యూజీ (2024) పరీక్ష పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు విచారణ మరోసారి ఈరోజు వాయిదా వేసింది. తొలుత దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ.సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు వాయిదాను పొడిగించింది. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), కేంద్ర ప్రభుత్వం అందించిన అఫిడవిట్లు అందరు పిటిషన్‌దారులకు ఇంకా చేరలేదని వెల్లడించింది.