ఈ నెల 23న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో కేంద్రం బడ్జెట్‌ను ఈ నెల 22న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు.గ్యారంటీలు సాగునీటి రంగానికి అధిక కేటాయింపులు ఉండొచ్చని అంచనా చర్చలు పూర్తయ్యాక దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.