ఈ నెల 4న ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి Amaravathi News భారత్ ప్రతినిధి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 4న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ,కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీకానున్నారు.కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత వస్తే ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచేందుకు సీఎం ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విభజన హామీల పైనా కేంద్ర పెద్దలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నట్టు సమాచారం.మోదీ ప్రమాణస్వీకారం తరువాత రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు తొలిసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.దీంతో ఆయన టూర్‌పై అటు రాజకీయ వర్గాల్లో,ఇటు ఏపీ ప్రజల్లో కూడా తీవ్ర ఆసక్తి నెలకొంది.ఏపీకి ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి ప్రకటన వెలువడనుంది ఎన్ని నిధులు వస్తాయన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైంది.