బాలికల యూనివర్సిటీ హాస్టల్ లో కుప్పకూలిన స్లాబ్
హన్మకొండ Hanmakonda News భారత్ ప్రతినిధి : బాలికల హాస్టల్లో స్లాబ్ కుప్పకూలిన ఘటన హనుమకొండ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ పోతన బాలికల హాస్టల్ అర్ధరాత్రి స్లాబ్ కుప్పకూలడంతో విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో గదిలో ఎవరు లేకపోవడంతో తమ ప్రాణాలకు ప్రమాదం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లేకపోతే ఎంతమంది ప్రాణాలకు హాని జరిగుండేది అంటూ యజమాన్యాన్ని విద్యార్థులు నిలదీస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఫ్యాన్ కిందపడి విద్యార్థికి గాయాలయ్యాయి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న ఎవరు పట్టించుకోవడం లేదంటూ యాజమాన్యాన్ని గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలకు ఏమైనా జరిగితే మీరు బాధ్యులా మిమ్మల్ని నమ్మి పంపిన మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇప్పటికి ఎన్నో ఘటనలు జరిగినా పెడచెవిన పెడుతున్నారు. మాకు ప్రాణ రక్షణ కావాలంటూ కాకతీయ యూనివర్సీటీ పోతన బాలికల హాస్టల్ అమ్మాయిలు ఆందోళన చేపడుతున్నారు.