కుందేళ్ల వేట కోసం వెళ్లి కరెంటు షాక్తో మృతి
* నంద్యానాయక్ తండాలో విషాదం
* తల్లిదండ్రులు దుఃఖ సంద్రంలో
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : అర్ధరాత్రి వేటకు వెళ్లి పెన్సింగ్ గమనించకుండా పొలం దాటుతుండగా కాళ్లకు తీగలు తాకి విద్యుదాఘాతంలో అక్కడిక్కడే మతిృ చెందిన దుర్ఘటన Died due to electric shock while hunting rabbits బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంద్యానాయక్ తండా గ్రామంలో చోటు చేసుకుంది.ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నంద్యానాయక్అండాకు చెందిన రాథోడ్ శంకర్,శాంతిబాయి కొడుకు రాథోడ్ అవినాష్(19) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.అయితే బుధవారం రాత్రి కుందేళ్ల వేట కోసం తండాకు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి అవినాష్ Avinash in Damarched village Basheerabad Mandal దామర్చెడ్ గ్రామశివారులోని పొలాల్లోకి వెళ్లారు.
గ్రామానికి చెందిన జోగి బలరాం అనే రైతు అడవి పందుల బెడదతో పంటను కాపాడుకోవడానికి పొలం చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకున్నాడు He installed an electric fence around the farm to protect the crop. అయితే వేటకోసం వచ్చిన ముగ్గురు యువకుల్లో అవినాష్ ముందుగా పొలంలోకి వెళ్లడానికి గట్టు దాటుతుండగా కాళ్లకు కంచె తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్నేహితుల కళ్ల ముందే విద్యుత్ షాక్తో అతడు మృతి చెందాడు He died of electric shock in front of his friends.దీంతో మిగతా ఇద్దరు తండాకు చేరుకొని కుటుబీకులకు చెప్పగా ఘటనాస్థలానికి వెళ్లి విలపించారు.
చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు Parents mourned the death of their helpless son.రైతుపై ఆగ్రహం బలరాం పొలంలో విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందడంతో తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మృతుడి తల్లి శాంతిబాయి తన కొడుకు ప్రమాదవశత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడని గురువారం తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.పొలం రైతుపై ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహానికి తాండూరు జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.