నేరుగా జీపే ఫోన్పే పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు
భారత్ ప్రతినిధి : ఆన్లైన్లో లో కరెంటు బిల్లు కట్టేవారందరూ ఇకనుంచి అప్రమత్తంగా ఉండా ఎస్పీడీసీఎల్ పేర్కొంది. ఈ నెల 1 నుంచి నేరుగా గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే, పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు అని 'దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్- డిస్కం) 'ఎక్స్'లో ప్రజలకు తెలిపింది. రిజర్వుబ్యాంకు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ ఉత్తర్వులిచ్చినట్లు వివరించింది. బిల్లు చెల్లింపుల్లో భద్రతకు పెద్ద పీట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని నిర్దేశించింది.
జులై1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను బిల్లర్లు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి హెచ్ఎఎఫీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ను యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఫోన్ పే, క్రెడ్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు. దీనివల్ల ఆయా యాప్లలో క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు వీలు పడదు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అదే జరిగింది.