సాగుభూమికే రైతుభరోసా ఇవ్వాలి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : రైతుభరోసా ప్రజాభిప్రాయ సేకరణలో మట్లాడుతున్న సొసైటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి సాగుభూమికే రైతు భరోసా పథకం అమలుచేయాలని రైతులు పలువురు అధికారులకు సూచించారు. నవాంధీ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక రైతువేదిక భవనంలో ఆదివారం రైతుభరోసా పథకం అమలుపై రైతులతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, సొసైటీ చైర్మన్ ఎ.వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్మన్ ఆజయ్ ప్రసాద్ నేతృత్వంలో అక్కడికి వచ్చిన పలువురు రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మెజార్టీ రైతులు బీడు భూములకు కాకుండా సాగుచేస్తున్న రైతులకు ఎంత భూమి ఉంటే అంతా రైతుభరోసా ఇవ్వాలన్నారు. శ్రీనివాస్ రెడ్డి, అశోక్ గౌతం, నారాగోపాల్ రెడ్డి, నవీన్ రెడ్డి, గోపాల్, బషీరాబాద్ ఏవో సూర్యప్రకాష్, సీఈవో బందెయ్య, పారుఖ్ పాల్గొన్నారు.
కులకచర్ల పంటలు సాగు చేసే రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు రైతులు విన్నవించారు. ఆదివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రాధమిక వ్యవసా సహకార సంఘం అధ్యక్షుడు మొగులయ్య డీసీవో ఈశ్వరయ్య ఆధ్వర్యంలో రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. రైతుల నుంచి సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. కనీసం 10 ఎకరాల వరకు రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని కోరారు. అంతే కాకుండా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎరువుల ధరలు కూడా తగ్గించాలని కోరారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని డీసీవో ఈశ్వరయ్య మాట్లాడుతూ తెలిపారు.
ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యకుడు భీమ్డ్డి, సొసైటీ వైసైర్మన్ నాగరాజు, సీఈవో బక్కారెడ్డిలు మాయాలాల సమావేశంలో మాట్లాడుతున్న పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి సకాలంలో రైతు భరోసా ఇస్తే పంటల సాగుకు ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తంచేశారు. రైతులతో వ్యవసాయాధికారులు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తూ రైతుభరోసా అమలుకు సలహాలు, సూచనలు అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా గోపాల్ మట్లాడుతూ రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం వ్యవసాయాధికారి గోపాల్కు సొసైటీ తరపున చైర్మన్, పాలకవర్గం సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మిర్యాణం శ్రీనివాస్ రెడ్డి,జిల్లా వ్యవసాయాధికారి గోపాల్,రైతు సమన్వయ సమితి మండల నాయకులు శంకర్రెడ్డి, డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు పాల్కొన్నారు.