కొత్త చట్టం అమలు ఢిల్లీలో తొలి కేసు నమోదు
Delhi News భారత్ ప్రతినిధి : దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత,భారతీయ నాగరిక్ సురక్ష సంహిత,భారతీయ సాక్ష్యా అధిని యం సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి.ఈ చట్టాల కింద తొలి FIR ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఈ రోజు నమోదైంది. ఓవర్‌బ్రిడ్జి పక్కనే విక్రయాలు జరిపిన వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రతిపక్షాలు అభ్యంతరం చేసినప్పటికీ కొత్త చట్టాలను కేంద్రం అమల్లోకి తీసు కొచ్చింది.