అమెరికాలో మాజీ అధ్యక్షునిపై కాల్పులు
జాతీయ National News భారత్ ప్రతినిధి : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు ఘటన చోటు చేసుకుంది Former US President Donald Trump was shot. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న సమయంలో దుండగులు ఒక్కసారిగా ట్రంప్ పై కాల్పులు జరిపారు.ట్రంప్ చెవికి బుల్లెట్ తగల డంతో తీవ్ర గాయమైంది. స్టేజీపైనే ట్రంప్ కుప్పకూలి పోయాడు. వెంటనే అప్రమ త్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్ చుట్టూ రక్షణగా చేరి భద్రత కల్పించారు.
Former US President Donald Trump narrowly escaped an assassination attempt at a campaign rally in Butler, Pennsylvania. The assailant has been identified as 20-year-old Thomas Matthew Crooks of Bethel Park, Pennsylvania. Crooks is said to have fired multiple shots from an elevated position on the roof of a manufacturing plant about 130 yards from where Trump was addressing supporters.
ఈ కాల్పుల్లో ట్రంప్ గన్ మెన్ సహా, ఎన్నికల సభలో పాల్గొన్న పౌరుడు మరణిం చినట్లు తెలిసింది. మరో వ్యక్తికి తీవ్ర గాయలయ్యా యి. అతని పరిస్థితి విష మంగా ఉన్నట్లు తెలిసింది.దుండగులు కాల్పుల్లో డొనాల్డ్ ట్రంప్ చెవికి గాయమై రక్తస్రావం కావడంతో ఆయన్ను భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. మాజీ అధ్యక్షుడిపై కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.చికిత్స అనంతరం ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తు న్నారు. అయితే, ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు దుండగులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఒక దుండగుడిని హత మార్చగా మరో దుండ గుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఆస్పత్రిలో చికిత్స అనం తరం కొద్ది గంటలకే ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారు.కాల్పుల ఘటనపై ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. మన దేశంలో ఇలా జరగడం నమ్మశక్యంగా లేదు. ప్రస్తుతం మరణించిన షూటర్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు.నా కుడి చెవి పైభాగానికి బెల్లెట్ తగిలింది. బుల్లెట్ గాయం కాగానే ఏదో తప్పు జరిగిందని నాకు వెంటనే అర్ధమైంది. ఎందుకంటే నేను పెద్దశబ్దం విన్నాను. తుపాకి కాల్పులు మోతతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారని ట్రంప్ చెప్పారు.