నిజామాబాద్ జిల్లాలో హోంగార్డు ఆత్మహత్య
నిజామాబాద్ Nizamabad News భారత్ ప్రతినిధి : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైలు కిందపడి హోంగార్డ్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది శనివారం ఉదయం రోజు వారిగా డ్యూటీ కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రైల్వే ఎస్సై కథనం ప్రకారం నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన గుమ్మడి దార్ల సంపత్ కుమార్ హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి విధులకు హాజరు కాలేదు. ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున తాగుడికి బానిసై అప్పుల బాధతో జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య తెలిపినట్లు ఎస్సై తెలిపారు.మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.