ఉద్యోగులు సమయానికి రాకుంటే చర్యలే మంత్రి తుమ్మల వార్నింగ్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో వివిధశాఖల పనితీరుపై మంత్రులు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది.వివిధ శాఖల్లో తనిఖీలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy
ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయశాఖ మంత్రికి ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి.నిర్ధేశిత సమయానికి కొంతమంది
ఉద్యోగులు మాత్రమే హాజరవ్వటంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి అందరు ఉద్యోగులు సమయానికి హాజరవ్వలని ఆదేశాలు జారీ చేశారు.లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కార్యాలయంలో ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వాలని ఉన్నతా ధికారులను మంత్రి ఆదేశించారు. ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల Mantri tummala హెచ్చరించారు. సమయపాలన లేకుండా ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాగే జరిగితే ఉద్యోగులపై చర్యలు తప్పవని మండిపడ్డారు.