Type Here to Get Search Results !

Sports Ad

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట In the case of the attack on the TDP central office the YCP leaders are relieved in the High Court


 టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ  నేతలకు హైకోర్టులో ఊరట 

అమరావతి Amaravathi News భారత్ ప్రతినిధి : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల కు హైకోర్టులో గురువారం ఊరట లభించింది తదుపరి విచారణ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో వైసీపీ నేతలు సజ్జల, తలశిల, దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే కాగా ఏపీలోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటివరకు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. పవన్, భాగ్యరాజ్, సుధాకర్​ను పోలీసులు అరెస్టు చేశారు. వారు ముగ్గురూ కృష్ణలంకకు చెందిన వారిగా పోలీసులు చెప్పారు. వారు ముగ్గురు ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు.

అంతకుముందు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగించారు. ఇదే కేసులో జింకా సత్యంతో పాటు తియ్యగూర గోపిరెడ్డి, లంకా అబ్బినాయుడును అరెస్టు చేశారు. మరికొంత మంది నిందితుల కోసం పోలీసులు ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies