నూతన ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కోర్విచెడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గుర్రాల అనంతమ్మ గార్డెన్స్ కళ్యాణ మండపంను ప్రారంభించి యాజమాని గుర్రాల తిరుపతి రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఆదివారం రోజున మండలంలోని కొర్విచెడ్ గ్రామ సమీపంలో ప్రధానరోడ్డు పక్కన నూతనంగా నిర్మించిన ఓ ఫంక్షన్ల్ను ఆదివారం ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మిర్యాణం శ్రీనివాస్ రెడ్డి, నవాంద్దీ సొసైటీ చైర్మన్ ఎ.వెంకట్రాంరెడ్డి, వైస్చర్మన్ అజయ్ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు జి.మాధవరెడ్డి, పి.శంకర్రెడ్డి, పిసుధాకర్రెడ్డి, మాణిక్ రెడ్డి, బాన్సిలాల్, వడ్డే హన్మంతు పాల్గొన్నారు.