ఎస్బీఐ లోన్లు మరింత ప్రియం MCLR IO పాయింట్లు పెంపు
జాతీయ National News భారత్ ప్రతినిధి : దేశీయ Domestic, అతిపెద్ద బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)' నిధుల వ్యయం ఆధారిత (MCLR) రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు సోమవారం వెల్లడించింది. కొన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) వరకు పెంచింది. సవరించిన రేట్లు నేటి (2024 జులై 15) నుంచే అమలవుతాయని ఎస్ బీఐ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఏడాది కాలవ్యవధి గల ఎంసీఎల్ఆర్ను 8.75 శాతం నుంచి 8.85 శాతానికి, ఆరు నెలల కాలవ్యవధికి 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, రెండేళ్లకు 8.85 శాతం నుంచి 8.95 శాతానికి, మూడేళ్ల కాలపరిమితి 8.95 శాతం నుంచి 9 శాతానికి ఎస్బీఐ పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్ ఆధారిత లోన్ల ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. ఎస్బీఐ ఆటో రుణాలు ఒక సంవత్సరం, వ్యక్తిగత రుణాలు 2 సంవత్సరాల ఎంసీఎల్ఆర్కు అనుసంధానించి ఉన్నాయి.
ఎంసీఎల్ఆర్ అంటే..?
ఎంసీఎల్ఆర్ అనేది ప్రామాణిక రుణరేటు. నిధుల సేకరణకు బ్యాంకులకు అయ్యే వ్యయం, నిర్వహణ వ్యయం, క్యాష్ రిజర్వు రేషియో (సీఆర్ఆర్), కాలపరిమితి, ప్రీమియంలను పరిగణలోకి తీసుకుని ఎంసీఎల్ఆర్ను లెక్కిస్తారు. బ్యాంకులు Banks, ఎంసీఎల్ఆర్ కంటే తక్కువకు రుణం అందించే అవకాశం ఉండదు. వివిధ కాలపరిమితులకు (ఓవర్ నైట్ నుంచి మూడేళ్ల వరకు) ఎంసీఎల్ఆర్ వేర్వేరుగా ఉంటుంది.
స్థిరంగా ఈబీఎల్ఆర్..
ఎస్బీఐ ప్రస్తుతం గృహ రుణాలను ఎక్స్టెర్నల్ బెంచ్మర్క్ లెండింగ్ రేట్స్' (EBLR) ఆధారంగా ఇస్తోంది. దీంట్లో మాత్రం ఎలాంటి సవరణలు చేయలేదు. ప్రస్తుతం ఈ ఈబీఎల్ఆర్ 9.15శాతం సీఆర్పీ బీఎస్పీ వద్ద స్థిరంగా ఉంచింది. ప్రస్తుతం ఎస్బీఐ Currently SBI, హోంలోన్ వడ్డీరేటు 8.50 శాతం నుంచి 9.65 శాతం మధ్య కొనసాగుతోంది. సిబిల్ స్కోర్ సహా ఇతర అర్హతలను బట్టి ఇది మారుతుంది.