పాల్వంచకు ఎన్నికలు జరపాలె రమేష్ రాథోడ్
పాల్వంచ Palwancha News భారత్ ప్రతినిధి : కేంద్ర గిరిజన కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు గ్రీన్ ఎర్త్ సొసైటీ రమేష్ రాథోడ్ విన్నపం పాల్వంచ పర్యటనలో భాగంగా ఒక ఫంక్షన్ హాల్ లో జాటోత్ హుస్సేన్ నాయక్ ఆత్మీయ అభినందన సభలో డాక్టర్ వీరు నాయక్, రమేష్ రాథోడ్, బాల కృష్ణ, సురేష్, తేజావత్ మోహన్ సన్మానం చేయటం జరిగింది.అనంతరం తెలంగాణ వ్యాప్తంగా మణుగూరు, మందమర్రి, పాల్వంచ. భద్రాచలం షెడ్యూల్ ప్రాంతాలు మున్సిపాలిటీ గా మార్పు చేసి, ఏలాంటి కోర్ట్ గొడవ లేకపోయినా రాజ్యాంగ పరమైన పాలన లేకుండా ఉన్నందున ఏజెన్సీ నాన్ ఏజెన్సీ వివాదం తేల్చి ఎన్నికలు జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి కీ తీసుకోని వెళ్లి చర్యలు చేపట్టాలని రమేష్ రాథోడ్ కోరారు, అలాగే సింగరేణి, కేటీపియస్ లో సమతా జడ్జిమెంట్, సీయస్సార్, DMFT నిధులపై దృష్టి సారించి న్యాయం జరిగేలా చూడలని కోరారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ వీరు నాయక్, తేజావత్ మోహన్, బాలకృష్ణ, సురేష్,ప్రవీణ్ బానోత్, తదితరులు పాల్గోన్నారు.