రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొఒక్కొటిగా అమలు చేస్తూ వస్తోంది. ఆరు గ్యారెంటీల్లో In six guarantees భాగంగా ఇప్పటికే పలు స్కీములను అమలు చేసింది.రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకొన్ని హామీలను అమలు చేసే దిశగా కసరత్తు షురూ చేసింది.ఈ క్రమంలోనే రైతులకు సంబంధించిన హామీల్లో ఒక్కటైనా రైతురుణమాఫీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.అయితే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.అయితే ఈ స్కీంను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
రైతు భరోసా స్కీం అమలుకు విధివిధానాలు రూపొందించేందుకు సర్కార్ మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావును సభ్యులుగా చేర్చింది.ఈ కమిటీ రైతు భరోసా స్కీంకు సంబంధించిన గైడ్ లైన్స్ ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తుంది. ఇక బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు కింద ఎకరానికి 10వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందించగా రేవంత్ రెడ్డి సర్కార్ Revanth Reddy Sarkar's exercise on farmer assurance మాత్రం ఏడాదికొ ఒక్కోఎకరానికి 15వేల సాయం అందిస్తామని చెబుతోంది.
అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే రైతు భరోసా అమలు చేయాల్సి ఉండగా. రైతు బంధు పథకంలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ అవకతవకలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని పకడ్బందీగా గైడ్ లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.అయితే ఈ సబ్ కమిటీ ఇచ్చే విధివిధానాలను మాత్రమే పరిగణలోనికి తసుకోకుండా వాటిని అసెంబ్లీలో చర్చకు పెట్టి.. వాటిపై ఆయా పార్టీల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటా మని సీఎం రేవంత్ తెలిపారు.దీంతో రైతు భరోసా స్కీంపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిబంధనలు పెడుతుంది.ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటందనేది రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.