తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఏడీసీగా ఉన్న సిరిశెట్టి సంకీర్త్ అదే హోదాలో ఇక నుంచి ఓఎస్డీగా వ్యవహరించను న్నారు. కొత్తగూడెం ఓఎస్డీగా పరి తోష్ పంకజ్, ములుగు ఓఎస్డీగా మహేశ్ బాబా సాహెబ్, హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీగా కాంతిలాల్ సుభాష్, భద్రాచలం ఏఎస్పీగా అంఖిత్ కుమార్,తోపాటు భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ఏటూరునాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయను నియమిస్తూ సీఎస్ శాంతి సోమవారం కుమారి ఉత్తర్వులు జారీచేశారు.