Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు Two Additional Long Periods Of Downpour In Telangana


 తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి జూలై 30న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న ఉత్తర ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 7.6 కి.
మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపుకు వంగి కొనసాగుతున్నది.

 ఋతుపవన ద్రోణి ఈరోజు బికనర్, అజ్మీర్, గుణ, పెండ్రా రోడ్, కొంటై గుండా వెళ్లుతూ తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. ఎత్తులో కొనసాగుతున్నది. ఈరోజు గాలి విచ్చిన్నతి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కి. మీ. ఎత్తు మధ్య వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి కొనసాగుతున్నది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన.

ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అక్కడ అక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం అవకాశం వుంది. హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.

హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు 20 నుంచి 30 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, పశ్చిమ - నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 08 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.9 డిగ్రీలుగా నమోదైంది. 86 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

మరిన్ని వార్తల కోసం....
* బషీరాబాద్ లో బోనాల వేడుకలు ఇక్కడ నొక్కండి
* నేడు రైతు రుణం తీర్చుకోనున్న రేవంత్ సర్కార్ ఇక్కడ నొక్కండి
* ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ ఇక్కడ నొక్కండి
* ఆగస్టు 14 నుంచి NEET-UG కౌన్సెలింగ్ ఇక్కడ నొక్కండి
* తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు ఇక్కడ నొక్కండి 
* బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఇక్కడ నొక్కండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies