ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
తెలంగాణ telangana News భారత్ ప్రతినిధి : ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ RTC Conductor పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ముషీరాబాద్ Mushirabad డిపోనకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు. బహదూర్ Bahadur పూరా వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ Conductor ఆర్.సరోజ అప్రమ త్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని గవర్నమెంట్ Gavarnament మెటర్నటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారు. బస్సులోనే కాన్పు చేసి మానవత్వం చాటు కున్న కండక్టర్ Conductor సరోజతో పాటు సహా మహిళా ప్రయాణికులను TG ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అభినందనలు తెలియ జేశారు. అప్ర్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం ప్రశంసనీ యమని అన్నారు.