Type Here to Get Search Results !

Sports Ad

ఉన్మాదిగా మారిన యువకుడు దంపతుల గొంతు కోసి దారుణ హత్య A young man who became a maniac cut the throats of a couple and brutally murdered them


ఉన్మాదిగా మారిన యువకుడు దంపతుల గొంతు కోసి దారుణ హత్య

వరంగల్ Warangal News భారత్ ప్రతినిధి : వరంగల్ జిల్లాలో దారుణ ఘటనా ఈరోజు తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఉన్మాదిగా మారిన యువకుడు ప్రేమించిన యువతి తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య ఛేశాడు. వివరాలలోకి వెళితే స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  బానోతు శివ సుగుణ వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం చింతల్ తండాకు చెందిన వారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో  కూతురు దీపికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. అయితే దీపిక అతని ప్రేమను తిరస్కరించింది. దీపిక 

పైకోపం పెంచుకున్న బన్నీ గురువారం ఉదయం కత్తితో దీపిక ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు.ఈ ఘటనలో దీపిక తల్లి దండ్రులు ఘటనా స్థలిలోనే మృతి చెందారు. అడ్డొచ్చిన దీపిక, ఆమె సోదరుడిపై యువకుడు దాడి చేశాడు. దీపిక, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందుతుడిని అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన దీపిక, ఆమె సోదరుడిని చికిత్స నిమిత్తం పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies