టీచర్లకూ ఫేషియల్ అటెండెన్స్ ఆగష్టు 16 నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో అమలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్ల బలోపేతంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా సర్కార్ బడులు, టీచర్లపై ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నది. టీచర్ల డుమ్మాలకు చెక్ పెట్టడంతో పాటు ప్రజల్లో వారిపై గౌరవం పెంచేలా ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తీసుకొస్తున్నది. అయితే దీన్ని ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్నుంచే ప్రారంభించాలని భావిస్తున్నది. ఆ తర్వాతే స్కూల్ లెవెల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ లోని అటెండర్ నుంచి ఆఫీసర్ దాకా అందరికీ ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 26 వేల స్కూళ్లు ఉండగా, వాటిల్లో 19 లక్షల మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. ఆయా బడుల్లో 1.03 లక్షల మంది టీచర్లు పని చేస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోనూ టీచర్లు, స్టూడెంట్ల అటెండెన్స్‌ను ట్రాక్ చేయాలని ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహకారం ద్వారా అందుతున్న పలు స్కీమ్స్ లో పారదర్శకత కోసం స్టూడెంట్లకు పోయినేడాది నుంచే ఫేషియల్ అటెండెన్స్ అమలు చేస్తున్నారు. మిడ్ డే మీల్స్, బుక్స్, యూనిఫామ్ తదితరాల కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే, ఇదే విధానాన్ని టీచర్లకు కూడా అమలు చేయాలని గతంలో భావించినా.
మళ్లీ ఈ విధానంపై చర్చ జరగడంతో అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ముందుగా ఆఫీసర్లకు అమలు చేసి, తర్వాత టీచర్లకు అమలు చేయాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో ఫేషియల్ అటెండెన్స్ విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే డైరెక్టరేట్, సమగ్ర శిక్ష అభియాన్‌లో పని చేస్తున్న సుమారు 150 మంది ఉద్యోగులకు ఫేషియల్ యాప్ ద్వారా అటెండెన్స్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ నెల 16 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని భావిస్తున్నారు.
తొలుత హైదరాబాద్ లో
టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని ముందుగా హైదరాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే టీచర్ల డేటాను సేకరించారు. ఫేషియల్ యాప్ ద్వారా టీచర్లకు అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. మొబైల్ ఫోన్లో ‘డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్’ యాప్ డౌన్లోడ్ చేసుకుని, పనిచేసే ప్రదేశంలోకి రాగానే టీచర్లు ఎవరికి వారే అటెండెన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే స్కూళ్లకు జియోట్యాగింగ్ ఉండటంతో, ఆ స్కూల్ ఆవరణలో ఉంటేనే. అది పనిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్జిల్లాలో సక్సెస్ అయితే, అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు.
Government has zeroed in on reinforcing Sarkar schools in the state. As a piece of this, the public authority is doing whatever it takes to fabricate public trust in schools and educators. Facial participation framework is being taken on to expand the admiration of individuals as well as checking the educators' dummas. In any case, being begun by the Directorate of School Training first is normal. After that at the school level Chose to execute. In this unique circumstance, most importantly, from the orderly to the official in the school training directorate, facial participation framework will be executed.
There are 26 thousand schools across the state and 19 lakh understudies are concentrating on in them. 1.03 lakh educators are working in those schools. The Public Training Strategy likewise needs to follow the participation of educators and understudies. Facial participation for understudies from last year for straightforwardness in many plans which are right now being upheld by the focal government is being executed. It is utilized for early afternoon feasts, books, uniform and so on. Nonetheless, in the past it was felt that a similar strategy ought to be executed for educators too.
It is realized that the public authority expects to begin the facial participation framework for educators in Hyderabad region first. Information of educators has previously been gathered. Participation framework will be executed for instructors through facial application. 'DSE FRS' application on cell phone Subsequent to downloading and coming to the work environment, the instructors should gauge participation themselves. As schools as of now have geotagging, provided that they are inside the school premises. The specialists are making plans to make it work. In the event that effective in Hyderabad area, being executed in all districts is normal.