నెలవారీ రీఛార్జ్ చేయలేకపోతున్నారా ఈ రూ.198 ప్లాన్ మీకోసమే
జాతీయ National News భారత్ ప్రతినిధి : నెలవారీ రీఛార్జ్ చేసేంత డబ్బులు మీ వద్ద లేవా అయితే మీకో శుభవార్త. రిలయన్స్ జియో రూ. 198 విలువైన కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. ఈ గడువు కాలం ఉన్నన్నీ రోజులు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 5G డేటాను ఆస్వాదించవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి 198 రూపాయలనేది సరసమైన ధర అయినప్పటికీ ఈ ప్లాన్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.
రూ.198 ప్లాన్ ప్రయోజనాలు....
14 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 2 GB 5G డేటా అందిస్తున్నారు. ఉచితంగా రోజుకు 100 SMSలు పంపుకునే వెసులుబాటు ఉంది. ఇవి బాగానే ఉన్నప్పటికీ.. నెల రోజులు పూర్తి కావాలంటే రెండుసార్లు రీఛార్జ్ చేపించాలి. దానివల్ల వినియోగదారుడిపై అదనపు భారం పడుతోంది.
రూ.349 ప్లాన్....
ఇలాంటి ప్రయోజనాలు ఉన్న నెలవారీ ప్లాన్ రూ.349 ధరకే అందుబాటులో ఉంది. రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే, 28 రోజుల చెల్లుబాటుతో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 2 GB 5G డేటా లభిస్తుంది. రోజుకు 100 SMSలు ఉచితంగా పంపుకోవచ్చు. అదే రూ.198 ప్లాన్‌ను ఎంచుకుంటే నెలకు రూ. 396 ఖర్చవుతుంది. కావున ఎక్కువ కాలం చెల్లుబాటు వ్యవధిని ఇష్టపడే వారికి ఇది కొంచెం ఖరీదైన ఎంపిక.
Good news for you if you don't have enough money to recharge every month. Reliance Jio Rs. 198 has introduced a new prepaid recharge plan. The validity of this plan is 14 days. All days during this validity period can enjoy unlimited voice calling and 5G data. If not, here's one thing to say, 198 rupees is a reasonable price but this plan has more disadvantages than advantages. Now let's see how.
With a validity of 14 days, this plan offers unlimited voice calling and 2 GB 5G data per day. There is facility to send 100 SMS per day for free. Although these are good.. you have to recharge twice to complete the month. Due to this additional burden is placed on the consumer.
A monthly plan with similar benefits is available at Rs.349. The Rs 349 plan recharge offers unlimited voice calling and 2 GB 5G data per day with a validity of 28 days. 100 SMS per day can be sent for free. If you choose the same Rs.198 plan per month Rs. 396 cost. So it is a slightly more expensive option for those who prefer a longer validity period.