మహిళల టీ20 ప్రపంచ కప్ ఇండియాలో జరుగుతుందా క్లారిటీ ఇచ్చిన జైషా
జాతీయ National News భారత్ ప్రతినిధి : షెడ్యూల్ ప్రకారం ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2024 బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. అయితే ఆ దేశంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు కారణంగా టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్ లో జరగడం అనుమానంగా మారింది. దీంతో భారత్ లేదా శ్రీలంకకు ఈ టోర్నీని తరలించనున్నట్లు సమాచారం. అయితే, అక్టోబర్‌లో శ్రీలంకలో వర్షం ముప్పు ఎక్కువ. ఈ నేపథ్యంలో భారత్ వైపే ఐసీసీ మొగ్గు చూపొచ్చని నివేదికలు చెప్పుకొచ్చాయి. తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా భారత్ లో మహిళా టీ20 ప్రపంచ కప్ నిర్వహించేదే లేదని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ వివాదం కారణంగా వేదిక మారితే.. ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ 2024కి భారత్ ఆతిథ్యం ఇవ్వబోదని జైషా వెల్లడించారు. ఐసీసీ ప్రపంచ కప్ ను నిర్వహించాలా వద్దా అనే విషయంపై బీసీసీఐని సంప్రదించిందని ఆయన చెప్పుకొచ్చారు. మీరు ప్రపంచ కప్ ను నిర్వహిస్తారా అని అని బీసీసీఐని ఐసీసీ అడిగింది. దానికి నేను నో చెప్పాను. ప్రస్తుతం భారత్ లో వర్షాకాలం. 2025 వన్డే ప్రపంచ కప్ ను మేమే నిర్వహించాలి. వరుసగా రెండు ప్రపంచ కప్ లు నిర్వహించే పరిస్థితిలో మేము లేము. అని ముంబై కార్యాలయంలో టైమ్స్ గ్రూప్ జర్నలిస్టులతో జరిగిన ఇంటరాక్షన్ సందర్భంగా షా చెప్పారు.
10 జట్లు 18 రోజులు
పది జట్లు తలపడే ఈ టోర్నీ అక్టోబర్ 3-20 వరకు జరగాల్సి ఉంది. పాల్గొనే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, క్వాలిఫయర్ 1 ఉండగా ఆతిథ్య బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, క్వాలిఫయర్ 2 గ్రూప్-బి లో ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి టాప్-2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 20న ఫైనల్ జరగనుంది.
As per the timetable, the ICC Ladies' Reality Cup 2024 is booked to be held in Bangladesh. Nonetheless, because of the fierce circumstance in that country, the T20 World Cup will be held in Bangladesh. It is accounted for that this competition will be moved to India or Sri Lanka. Be that as it may, the gamble of downpour is high in October in Sri Lanka. In this unique circumstance, reports say that the ICC might lean toward India. As of late, BCCI Secretary Jaisha has clarified that the Ladies' T20 World Cup won't be held in India.
Jaisha uncovered that India won't have the ICC Ladies' T20 World Cup 2024 assuming the setting is changed because of the continuous political clash in Bangladesh. He said that the BCCI has been counseled on regardless of whether the ICC ought to coordinate the World Cup. ICC found out if you will sort out the World Cup. I expressed no to that. It is storm season in India. 2025 ODI World Cup ought to be coordinated by us. We are not in that frame of mind to hold two World Cups in succession. Shah said during a communication with Times Gathering columnists at the Mumbai office.
10 groups for 18 days
The ten-group competition is planned to be held from October 3-20. The partaking 10 groups are isolated into two gatherings. India, Australia, Pakistan, New Zealand and Qualifier 1 are in Gathering some time has Bangladesh, Britain, South Africa, West Indies and Qualifier 2 are in Gathering B. The main 2 groups from the two gatherings will meet all requirements for the semis. The last will be hung on October 20.