3 గోనె సంచుల్లో 4 వేల పాత మొబైల్ ఫోన్లు ఇలా పాత ఫోన్లు అమ్మకండి ఎందుకంటే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పాత మొబైల్ ఫోన్లు కొంటున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ల కోసం సైబర్ నేరగాళ్లు పాత ఫోన్లను వాడుతున్నారు. వాడిన మొబైల్ ఫోన్లకు డబ్బులు ఇచ్చి లేదా ప్లాస్టిక్ సామాను ఇచ్చి ఈ ముఠా ఫోన్లు కొంటున్నట్లు తెలిసింది. 3 గోనె సంచుల్లో 4 వేల మొబైల్ ఫోన్లు లభ్యం కావడం గమనార్హం. బీహార్కి చెందిన మహమ్మద్ షమీ, అబ్దుల్ సలాం, మహమ్మద్ ఇఫ్తికర్ గోదావరి ఖని పోలీసులు అరెస్ట్ చేశారు. గోదావరి ఖని పవర్ హౌజ్ కాలనీలో పాత మొబైల్ ఫోన్స్ కొంటుండగా పోలీసులు పట్టుకున్నారు.
తెలంగాణ జిల్లాల్లో గ్రామగ్రామాన మొబైల్ ఫోన్లు కొని బీహార్ మీదుగా జామ్ తారా, దేవ్ ఘర్, జార్ఖండ్కు ఈ ముఠా తరలిస్తున్నట్లు తెలిసింది. సైబర్ నేరగాళ్లకు అమ్మే ముందు మొబైల్ ఫోన్స్ లో సాప్ట్వేర్ మార్చడం, ఇతర విడి భాగాలు మార్చి ఫోన్ పనిచేసేలా మార్చి సైబర్ నేరగాళ్లకు ఈ ముఠా అమ్ముతున్నట్లు పోలీసులు తేల్చారు. గుర్తు తెలియని వ్యక్తులకు మీ పాత ఫోన్లను అమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
The police caught a gang buying old mobile phones. 4 thousand old mobile phones were seized. Cybercriminals are using old phones for cybercrimes. It is known that this gang buys used mobile phones by giving them money or plastic goods. 4 thousand mobile phones are available in 3 sacks It is noteworthy that Mohammad Shami, Abdul Salam and Mohammad Iftikhar Godavari Khani from Bihar were arrested by the police. He was caught by the police while buying old mobile phones in Godavari Mine Power House Colony.
It is known that this gang is buying mobile phones from villages in Telangana districts and moving them to Jam Tara, Devgarh and Jharkhand via Bihar. The police have concluded that this gang is selling mobile phones to cyber criminals by changing the software and other spare parts to make the phone work before selling it to cyber criminals. Police advises you not to sell your old phones to unknown people.