రేపే రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్
హైదరాబాద్ Hyderabad News భారత్ న్యూస్ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం ఇవాళ జరగ నుంది. రాత్రి 7గంటలకు నానక్ రామ్‌గూడలోని హోటల్ షెరటాన్ లో ప్రారం భమవుతుంది. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యే లతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆహ్వానం అందించారు.ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ పరిచయ కార్యక్రమం తోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.
ఈ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఈ రోజు హైదరాబాద్ చేరుకుంటారు.సీఎల్పీ సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్దిత్వానికి మద్దతు ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలను మర్యాద పూర్వకంగా సింఘ్వీ కోరనున్నారు.రేపు అసెంబ్లీలో 11 గంటల కు సింఘ్వీ నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గోనున్నారు.
మరిన్ని వార్తలకు
* రేపే రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్ ఇక్కడ క్లిక్ చేయండి
* వెన్ను చూపని వీరుడు సుభాష్ చంద్రబోస్ ఇక్కడ క్లిక్ చేయండి
* బెంగాల్ డాక్టర్ అత్యాచారం వెనుక భయంకరమైన నిజాలు ఇక్కడ క్లిక్ చేయండి
* కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరిన గాయని పి.సుశీల ఇక్కడ క్లిక్ చేయండి
* నీళ్లపల్లి గ్రామాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో ఇక్కడ క్లిక్ చేయండి