Type Here to Get Search Results !

Sports Ad

గ్యాస్​ సమస్యతో బాధ పడుతున్నారా అయితే వీటికి దూరంగా ఉండండి Avoid These If You Are Suffering From Gas Problem

గ్యాస్​ సమస్యతో బాధ పడుతున్నారా అయితే వీటికి దూరంగా ఉండండి 

ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : వర్షాకాలంలో చాలా మంది అజీర్ణంతో బాధపడుతుంటారు వాతావరణంలో అధిక తేమ కారణంగా జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. శరీరంలో బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. దీంతో తిన్న ఆహారం జీర్ణం కాక చాలా ఇబ్బందులు పడుతుంటారు.  ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కొన్నిరకాలు ఆహారపదార్ధాలకు దూరంగా ఉండాలనా  వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు అవేంటో చూద్దాం.

 వర్షాకాలంలో ఎక్కువ మంది వేయించిన ఆహారం, స్పైసీ ఫుడ్ తినడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. దీంతో అరుగుదల దెబ్బతిని ఆరోగ్య పరంగా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే వర్షాకాలం కొన్ని రకాల ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గోధుమలు : వీటిలో  గ్లూటాన్ కంటెంట్ గోధుమల్లో అధికంగా ఉంటుంది. దీని వల్ల ఉబ్బరం వంటి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గ్లూటాన్ సెన్సిటివిటీలతో పాటు ఉదరకుహర వ్యాధి ఉన్నవారిలో అజీర్ణం సమస్య  ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో జీర్ణ సమస్య వల్ల గ్లూటాన్ ఉన్న  ఆహారాలను జీర్ణం అవడం కష్టంగా మారుతుంది. వర్షాకాలంలో వీలైనంత వరకు బ్రెడ్, పేస్ట్రీలు వంటి గోధుమ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది.

బార్లీ : ఇందులో  పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయినా దీనిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే ముఖ్యంగా వర్షాకాలంలో బార్లీతో తయారు చేసిన ఆహారం జీర్ణం అవడం చాలా కష్టం అవుతుంది. అజీర్ణంతో పాటు గ్యాస్ వంటి సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

మిల్లెట్స్: వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం అవడం చాలా కష్టం. ముఖ్యంగా వర్షాకాలంలో జీర్ణ క్రియ మందగించినప్పుడు మిల్లెట్స్ వంటి ధాన్యాలు తినకుండా ఉంటే బాగుంటుంది. ధాన్యాలను ప్రాసెస్ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఇది సవాలుగా మారుతుంది.

ఓట్స్ : మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఓట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ కొన్ని సార్లు అజీర్ణం సమస్యకు ఇది కారణం అవుతుంది. అందుకే సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్న వారు వర్షాకాలంలో ఓట్స్ కు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సీజన్ లో ఓట్స్ తినకుండా ఉంటేనే మంచిది.

జొన్నలు : జొన్నలతో తయారు చేసిన పదార్దాలను వర్షాకాలంలో తింటే త్వరగా జీర్ణం కాక  అజీర్ణ సమస్యతో ఇబ్బంది పడతారు. గ్యాస్ సమస్యతో బాధ పడే వారు  జొన్నలు తినకుండా ఉంటే చాలా మంచిది. వర్షాకాలంలో అధిక పిండి పదార్థం కలిగిన జొన్నలు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో జొన్నలు తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం సమస్య పెరుగుతుంది.

జంక్ ఫుడ్ : మైదాతో తయారు చేసిన జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఈ సమస్యలు మరింత పెరుగుతాయి. నూడిల్స్, పిజ్జా, బర్గర్ వంటి వాటి వల్ల జీర్ణ సమస్యలు పెరుగుతాయి. 

 అందుకే వర్షాకాలంలో ఇలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా బియ్యం, క్వినోవాతో పాటు ధాన్యాలను, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం వల్ల వర్షాకాలంలో అజీర్ణం సమస్య పెరుగుతుంది.

Many individuals experience the ill effects of heartburn during the blustery season as the stomach related framework dials back because of the great dampness in the climate. The development of microscopic organisms in the body is high. Because of this, the food eaten isn't processed and they endure a ton. Clinical specialists propose keeping away from specific food sources to battle this issue. Presently how about we see that.

 Eating broiled food and fiery food during blustery season likewise troubles the stomach related framework. Because of this, we need to deal with numerous issues as far as wellbeing because of mileage. For that reason clinical specialists say that particular kinds of food ought to be kept away from during the blustery season.

 That is the reason specialists say that staying away from such food during the blustery season is better. Rather than these, eating effectively absorbable food sources like rice, quinoa and grains can build the issue of heartburn during rainstorm.

మరిన్ని వార్తల కోసం.... 
* డ్రైఫ్రూట్స్ తింటే 5ఆరోగ్యకర లాభాలు ఇక్కడ క్లిక్ చేయండి
* సీఎం రేవంత్కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క ఇక్కడ క్లిక్ చేయండి
* రాఖీ పండుగ రోజు ఆకాశంలో అద్భుతం అది ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయండి
* పొట్టే కదా అని పారేస్తున్నారా ఇందులో ఎన్నో పోషకాలున్నాయి ఇక్కడ క్లిక్ చేయండి
* ఆస్పత్రిలో అన్న తమ్ముడికి రాఖీ కట్టి ప్రాణాలు వదిలిన చెల్లెలు ఇక్కడ క్లిక్ చేయండి
* దేశవ్యాప్తంగా భారీ వర్ష సూచన పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఇక్కడ క్లిక్ చేయండి
* భవిష్యత్తులో రోజుకు 25 గంటలు భూమిపై వెన్నెల రాత్రులు ఉండవా ఇక్కడ క్లిక్ చేయండి
* వెజ్​ ఫుడ్​తో డిప్రెషన్​ దూరం శాకాహారుల్లో ప్రొటీన్, విటమిన్ సీ స్థాయిలు అధికం ఇక్కడ క్లిక్ చేయం

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies