బంగ్లాదేశ్ గతం వర్తమానం
బంగ్లాదేశ్ Bangladesh News భారత్ ప్రతినిధి : స్వాతంత్ర్యం రాకముందు నుంచి తూర్పు బెంగాల్ భారతదేశంతో సాంస్కృతికంగా, రాజకీయంగా ఎంతో సంబంధం కలిగి ఉంది. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు బంగ్లాదేశ్ ప్రాంతంలో జన్మించారు. నాగమహాశయ వంటి ఆధ్యాత్మికవేత్త అక్కడే జన్మించారు. నిజానికి బంగ్లాదేశ్ ఉర్దూ భాషను విభేదించి ఓ కొత్త దేశంగా పాకిస్తాన్ నుంచి విడిపోవడంలో భారతదేశం పాత్ర చాలా ఉంది.
ఈ ఆపరేషన్‌లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వ్యవహరించిన తీరు ఆమెని ఈ దేశంలో చాలామంది గౌరవించేటట్టు చేసింది. బంగ్లాదేశ్‌లో ప్రధాని షేక్ హసీనా పడకగదిలోకి కూడా వెళ్లి ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను తాళ్లతో ఉరేసి, సుత్తిలతో కొట్టి వికృతానందం పొందారు. అలాగే అవామీలీగ్ నేతల ఇండ్లపై, అక్కడి హిందువుల ఇండ్లపై దాడిచేసి వాళ్ళ మానప్రాణాలు హరించారు.
బంగ్లాదేశ్ ఏర్పడకముందు పాకిస్తాన్ సైన్యం చేసిన అరాచకాలు ప్రపంచంలోని అతిపెద్ద వరుసలో జరిగిన నరమేధంగా చెప్తారు. సరిగ్గా అలాంటి అకృత్యాలే ఇప్పుడు బంగ్లాదేశ్ వీధుల్లో దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలోనే శక్తిమంతమైన మానవ హక్కుల సంస్థలు కనీసం నోరు కూడా మెదపడం లేదు. మన దేశ మీడియా కూడా ఇదొక సంక్షోభంగా, తిరుగుబాటుగా చూపిస్తుంది తప్ప వాళ్ల అకృత్యాలకు అరాచకాలకు బలి అవుతున్న వ్యక్తులపై ఫోకస్ చేయడంలేదు.
హసీనా కూడా పురుషుడై ఉంటే ఉరితీసే వాళ్లేమో బంగ్లాలో తిరుగుబాటు వెనకాల చైనా ఉందని కొందరు, పాకిస్తాన్ ఉందని మరికొందరు, అమెరికా ఉందని ఇంకొందరు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. మతోన్మాదంతో విర్రవీగుతున్న పాకిస్తాన్ శక్తులు ఇందులోకి చొరబడి ఉంటాయని చాలా మంది విశ్లేషకుల భావన. బంగ్లాదేశ్ చైనాతో చేసిన అప్పులు తడిసి మోపిడైపోయాయి. షేక్ హసీనా ముందు నుంచి భారత్ ఫ్రెండ్లీ నేచర్‌తో ప్రభుత్వం నడుపుతున్నది. ఇది అక్కడి మతవాద శక్తులకు ఇష్టం లేదు.
East Bengal has been socially and politically firmly associated with India since before autonomy. Numerous political dissidents were brought into the world in Bangladesh locale. A spiritualist like Nagamahasaya was brought into the world there. As a matter of fact, India assumed a part in the division of Bangladesh from Pakistan as another country because of contrasts in the Urdu language.
The manner in which State head Indira Gandhi acted in this activity made her regarded by many individuals in this country. In Bangladesh, the fomenters even went to State head Sheik Hasina's room and made destruction. The sculptures of Hasina's dad Sheik Mujibur Rahman were mangled by balancing them with ropes and beating them with hammers. Likewise, they went after the places of Awami Association pioneers and the places of Hindus there and ended their lives.
The monstrosities committed by the Pakistan Armed force before the arrangement of Bangladesh are supposed to be the world's biggest sequential destruction. Precisely such outrages are presently seen in the city of Bangladesh. The most impressive basic freedoms associations on the planet are not in any event, talking. Indeed, even the media of our nation shows this as an emergency and insubordination yet doesn't zero in on individuals who are casualties of turmoil for their wrongdoings.
Assuming that Hasina was likewise a man, they would have hanged her, some say that China is behind the uprising in Bangladesh, some say that Pakistan is behind it, and some say that America is behind it. Numerous examiners feel that Pakistani powers, tired of sectarianism, may have penetrated it. Bangladesh's obligations with China have been cleared out. Since before Sheik Hasina, India has been running the public authority with a well disposed nature. This isn't loved by the strict powers there.