Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం Bashirabad Horticulture Market Board Of Trustees Promise Swearing Service

బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

Basheerabad News బషీరాబాద్ భారత్ ప్రతినిధి : బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గంలో ప్రమాణస్వీకారం మహోత్సవం ఘనంగా జరిగాయి. సోమవారం మండల కేంద్రంలో బషీరాబాద్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, వైస్ చైర్మన్ చందర్, పాలకవర్గ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు.

 అనంతరం మంత్రులు, శాసనసభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో బషీరాబాద్ మండలానికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో కూడా అధిక మొత్తంలో కేటాయిస్తామని తెలిపారు. ఏడునెలల వ్యవధిలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేశామని అన్నారు. త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని అందజేస్తామని అన్నారు. అదేవిధంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న భూ సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు. 

 అంతకుముందు బషీరాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులకు 30 కోట్ల నిధులతో శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ఆర్డీవో శ్రీనివాసరావు, బషీరాబాద్ మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, బషీరాబాద్ పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామ్ రెడ్డి, బషీరాబాద్ సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్ పాల్గొన్నారు.

Bashirabad Horticulture Market Board's swearing-in service was held in a fantastic way. The vow taking service of the new administering assortment of Bashirabad Mandal Rural Market Board was held at Mandal Center on Monday. The central visitors of this program were Regulative President Gaddam Prasad Kumar, Pastors Ponguleti Srinivas Reddy, Komati Reddy Venkata Reddy and Oven MLA Manohar Reddy were available. In the program coordinated on this event, the Executive of the Agrarian Market Board of trustees, Madhav Reddy, Bad habit Director Chander and individuals from the administering body madevow.

 From that point forward, Clergymen and Authoritative Gathering President Prasad Kumar vowed to designate more assets to Basheerabad Mandal in Tandur Electorate and foster it. Likewise, an enormous sum will be dispensed for the dissemination of Indiramma houses, he said. He said that the ensures given to individuals by the Congress government for a time of seven months have been executed. He said that Mahalakshmi Plan will be given to ladies soon. Essentially, the land issues in the Karnataka line region will likewise be settled, he said.

 Prior, establishment stones were laid for a few improvement works in Bashirabad mandal with assets of 30 crores. Locale Gatherer Pratik Jain, RDO Srinivasa Rao, previous ZPTC of Bashirabad Srinivas Reddy, previous MPP Karuna Ajay Prasad, Executive of Bashirabad PACS Venkataram Reddy and senior heads of Bashirabad Ajay Prasad partook in this program.

మరిన్ని వార్తల కోసం....
* శ్రావణమాసం నో నాన్‌వెజ్ సైంటిఫిక్ రీజన్ ఇదే ఇక్కడ క్లిక్ చేయండి
* ప్లాస్టిక్ బాటిల్‌‌లో నీరు తాగుతున్నారా జాగ్రత్త ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ క్లిక్ చేయండి
* రోహిత్ శర్మ ముంగిట మరో రికార్డు ఇక్కడ క్లిక్ చేయండి
* ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* సాగర్ 22 గేట్లు ఎత్తివేసిన అధికారులు పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ నూతన ఆర్ఎఐగా నాగార్జున్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఇక్కడ క్లిక్ చేయండి
* ఘనంగా ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
* నేవీ రాడార్ ఏర్పాటు ను వెంటనే విరమించాలి ఇక్కడ క్లిక్ చేయండి
* స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies