Type Here to Get Search Results !

Sports Ad

సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై బిగ్ ట్విస్ట్ Big twist on Kavitha's bail petition in Supreme Court

 

సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై బిగ్ ట్విస్ట్

న్యూఢిల్లీ New Delhi భారత్ న్యూస్ ప్రతినిధి : సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ  విచారణ జరిగింది.కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

 స్పందన తెలియజేయాలని కేంద్ర ఏజెన్సీలను కోర్టు కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరిపింది.

సీబీఐ, ఈడీ కేసులలో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును కవిత సవాల్ చేశారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక కవిత తరుఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 5 నెలల నుంచి ఆమె జైల్లో ఉన్నారు. 463 మంది సాక్షులను విచారించామని ధర్మాసనం పేర్కొంది.

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టు బెయిల్ నిరాకరించాయి. దీంతో ఆమె ఆశలన్నీ సుప్రీంకోర్టు పైనే పెట్టుకున్నారు. ఇవాళ తనకు బెయిల్ వస్తుందని ఆమె భావించినట్టు సమాచారం. తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తనకు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేశారు. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(క్రిమినల్‌) దాఖలు చేశారు. అక్కడ కూడా వాయిదా పడింది. ఇక బెయిల్ కోసం మరో వారం పాటు కవిత వేచిచూాడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుడైనా బెయిల్ వస్తుందో రాదో వేచిచూడాల్సి ఉంది.

ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ఆమె కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవలే ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరూ కవితకు బెయిల్‌ అంశంపై చర్చించారని జోరుగా ప్రచారం సాగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కోర్టులో నిరాశే ఎదురవ్వడం గమనార్హం.

ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 50 మందిని నిందితులుగా పేర్కొన్నాయని అందులో కవిత మాత్రమే మహిళ అని ఆమె తరుఫు సీనియర్ న్యాయవాదులు గతంలో ఢిల్లీ హైకోర్టులో వాదించారు. మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయని తెలిపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్‌ ఇవ్వాలన్నారు.

ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థల తీరును ఆమె తరుఫు న్యాయవాది తప్పుబట్టారు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయని.. అరెస్టు సమయంలో కనీస నిబంధనలు పాటించలేదని.. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయని వాటి కింద కవితకు బెయిల్‌ ఇవ్వాలని కవిత తరఫున సీనియర్‌ న్యాయవాదులు వినిపించిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

మరిన్ని వార్తలకు.... 
* సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై బిగ్ ట్విస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి
*  ముఖ్యంగా పురుషులు త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి BLACK GRAM ఇక్కడ క్లిక్ చేయండి
* ఎండిన ఖర్జూరాలు నానబెట్టి తీసుకుంటే వలన లాభమెంతో తెలుసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి
* పిల్లలకు హార్లిక్స్, బూస్ట్ ఇస్తున్నారా ? జాగ్రత్త మరి...!! ఇక్కడ క్లిక్ చేయండి
*  యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తున్న గులాం మతీన ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies