బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బంది
Basheerabad News బషీరాబాద్ భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కొన్ని సంవత్సరాలుగా విధి నిర్వహణలో భాగంగా ఏఎస్ఐ, కానిస్టేబుల్ 6 మంది బదిలీ అయినట్టు ఎస్పై రమేష్ కుమార్ తెలిపారు. విధి నిర్వహణ భాగంగా సేవలందించి ప్రజల సమస్యలను పరిష్కారం చేసి ఉన్నతాధికారుల ప్రజల సమస్యలను పరిష్కారం చేసి ప్రశంస పత్రాలు అవార్డులు పొంది, బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ వేణుగోపాల్, పోలీస్ సిబ్బంది చెన్నయ్య, శంకర్, రాందాస్, శ్రీనివాస్, జావీద్, లను స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం రోజు ఎస్పై రమేష్ కుమార్ ఘనంగా శాలువ పూలమాలతో సన్మానించారు.
ఈ సందర్భంలో ఏఎస్ఐ, పోలీస్ సిబ్బంది మాట్లాడుతూ కర్ణాటక లాస్ట్ బార్డర్ లో ఇక్కడ ప్రజలకు విధి నిర్వహణలో చక్కగా పని చేసుకున్నాం ఫ్రెండ్ పోలీస్ గాని సామాన్య ప్రజలకు కూడా ప్రజాప్రతినిధులతో అందరితో కలిసిపోయామని సంతోషంగా డ్యూటీ చేసుకున్నామని అన్నారు. ఎస్ఐ రమేష్ కుమార్
మాట్లాడుతూ ఇక్కడ పనిచేసే బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ, పోలీస్ సిబ్బంది ముందుగా సంపూర్ణ ఆరోగ్యంతో కుటుంబంతో సంతోషంగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరికి స్థాన చలనం కంపల్సరీ కాబట్టి బదిలీ కావడం తప్పదు ఈ సిబ్బంది ఎంతగానో విధి నిర్వహణలో నాకు సహకరించారు.
శాంతి భద్రత పరిరక్షణకు, నేరాల నియంత్రణ క్లిష్టమైన బందోబస్తు విధులు నిర్వహణలో అందరి కృషి అభినందనీయమని అన్నారు. బదిలీపై వెళ్తున్న సిబ్బంది అందరూ మంచి విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ప్రమోషన్లతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.