Type Here to Get Search Results !

Sports Ad

మీ లైఫ్ స్టైల్ ఇలా మార్చుకోకపొతే క్యాన్సర్ ఖాయం Cancer Is Certain If You Don't Change Your Lifestyle Like This

మీ లైఫ్ స్టైల్ ఇలా మార్చుకోకపొతే క్యాన్సర్ ఖాయం

ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : వయసు పెరిగేకొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. క్యాన్సర్ పట్ల కనీస అవగాహన లేక చాలా మంది చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. అయితే, మన లైఫ్ స్టైల్ లో చిన్న మార్పులు చేసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడచ్చు. ముఖ్యంగా 20ఏళ్ళ నుండి 30, 40ఏళ్ళ వయసు గల వారు లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు చేసుకొని జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్ కి దూరంగా ఉండచ్చు.

20 నుండి 40 ఏళ్ళ వయసులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: హెల్తీ డైట్ మెయింటైన్ చేయటం: పండ్లు, కూరగాయలు, హోల్ గ్రైన్స్ తో పాటు లీన్ ప్రొటీన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చు. ప్రాసెస్డ్ ఫుడ్, రెడ్ మీట్‌ల వినియోగం వీలైనంత తగ్గించటం ఆల్కహాల్ కి దూరంగా ఉండటం కూడా మంచిది.

రెగ్యులర్గా వ్యాయామం చేయటం: ప్రతిరోజూ కనీసం 150 నిమిషాల వ్యాయామం చేయటం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయటం ద్వారా బరువును నియంత్రించటమే కాకుండా వివిధ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

స్మోకింగ్ కి దూరంగా ఉండటం: ధూమపానం మరియు పొగాకు వినియోగం క్యాన్సర్‌కు ప్రధాన కారణాలని చెప్పచ్చు. ధూమపానం అలవాటు ఉంటే, మానేయడానికి ప్రయత్నించండి. అంతే కాకుండా సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ కి కూడా దూరంగా ఉండండి

చర్మ సంరక్షణ: అధిక SPF ఉన్న సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. శుభ్రమైన దుస్తులను ధరించటం, బెడ్ ని శుభ్రంగా ఉంచుకోవటం ద్వారా చర్మ క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చు.

టీకాలు తీసుకోవడం: HPV వ్యాక్సిన్ వంటి టీకాలు కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షిస్తాయి. డాక్టర్ ని సంప్రదించి ఎప్పటికప్పుడు అవసరమైన టీకాలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడచ్చు.

రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం: 30ఏళ్ళ వయసు దాటిన ప్రతిఒక్కరు తప్పకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. తద్వారా క్యాన్సర్ ముప్పును ముందే పసిగట్టి ప్రమాదం నుండి బయటపడవచ్చు.

స్ట్రెస్ మేనేజ్మెంట్: స్ట్రెస్ ఎక్కువైతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్ట్రెస్ వల్ల వచ్చే ప్రధాన సమస్యల్లో క్యాన్సర్ ఒకటి, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఫాలో అవ్వటం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం నుండి బయటపడచ్చు.

The risk of cancer increases with age. Many people suffer from cancer at a young age due to lack of knowledge about cancer. However, if we make small changes in our lifestyle, we can avoid getting cancer. Especially those aged 20 to 30 and 40 can stay away from cancer if they make small changes in their lifestyle and follow precautions.

 Precautions to be taken at age 20 to 40: Maintaining a healthy diet: Eating a balanced diet rich in fruits, vegetables, whole grains and lean proteins can help prevent cancer. It is also good to reduce the consumption of processed food and red meat as much as possible and avoid alcohol.

 Regular exercise: At least 150 minutes of exercise every day must be a habit. Regular exercise not only helps control weight but also reduces the risk of various cancers.

 Avoiding smoking: Smoking and tobacco use are the main causes of cancer. If you are a smoker, try to quit. Apart from that, stay away from secondhand smoking.

 Skin Care: Use a sunscreen with a high SPF. Skin cancer can be avoided by wearing clean clothes and keeping the bed clean.

 Getting vaccines: Vaccines like the HPV vaccine protect against some types of cancer. By consulting the doctor and taking necessary vaccinations from time to time, one can avoid getting cancer.

 Regular Health Checkups: Everyone above the age of 30 should have regular health checkups. Thus, the threat of cancer can be detected early and the risk can be avoided.

 Stress Management: Too much stress can lead to many health problems. Cancer is one of the major problems caused by stress and following stress management techniques can reduce the risk of cancer.

మరిన్ని వార్తల కోసం....
* సడెన్ షాకిచ్చిన ఎస్బీఐ వడ్డీ రేట్లు పెంపు ఇక్కడ క్లిక్ చేయండి 
* మీ లైఫ్ స్టైల్ ఇలా మార్చుకోకపొతే క్యాన్సర్ ఖాయం ఇక్కడ క్లిక్ చేయండి 
* రాత్రి పూట స్విగ్గీ జొమాటో సర్వీసులు బంద్ చేయాలే ఇక్కడ క్లిక్ చేయండి 
* పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం వాతావరణ శాఖ హెచ్చరిక ఇక్కడ క్లిక్ చేయండి 
* గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి 
* మహిళల టీ20 ప్రపంచ కప్ ఇండియాలో జరుగుతుందా క్లారిటీ ఇచ్చిన జైషా ఇక్కడ క్లిక్ చేయండి 
* స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన రాహుల్ గాంధీకి అవమానం ఇక్కడ క్లిక్ చేయండి 
* టీచర్లకూ ఫేషియల్ అటెండెన్స్ ఆగష్టు 16 నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​లో అమలు ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies