Type Here to Get Search Results !

Sports Ad

వెజ్​ ఫుడ్​తో డిప్రెషన్​ దూరం శాకాహారుల్లో ప్రొటీన్, విటమిన్ సీ స్థాయిలు అధికం Depression Goes Away With Vegetarian Food Protein And Vitamin C Levels Are High In Vegetarians

 వెజ్​ ఫుడ్​తో డిప్రెషన్​ దూరం శాకాహారుల్లో ప్రొటీన్, విటమిన్ సీ స్థాయిలు అధికం 

ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : మీరు డిప్రెషన్​ను దూరంగా తరిమేయాలని అనుకుంటున్నారా మెదడు ఆరోగ్యాన్ని పెంచుకోవాలని ఉందా మూడ్​ను మంచిగా ఉంచుకోవాలని భావిస్తున్నారా అయితే వెజ్ ఫుడ్ తినాల్సిందే అంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్​సీయూ) రీసెర్చర్లు. మాంసాహారంతో పోలిస్తే శాకాహారం తినేవారిలో మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందని, డిప్రెషన్ తోపాటు యాంగ్జైటీ వంటి లక్షణాలు దరిచేరవని ఇటీవల హెచ్​సీయూలోని స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వరలక్ష్మి మంచన ఆధ్వర్యంలోని బృందం చేసిన స్టడీలో వెల్లడైంది. 

 40 ఏండ్లు దాటిన 304 మంది ఆహారపు అలవాట్లు వారిలో మెదడు ఆరోగ్యంపై 6 నెలల పాటు అధ్యయనం చేసి వారు ఈ నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు వెజిటేరియన్లలో వృద్ధాప్య జన్యువులు కూడా స్లో అవుతున్నాయని, ఫలితంగా వారిలో వృద్ధాప్య ఛాయలు కూడా కొంచెం ఆలస్యంగా వచ్చేందుకు ఆస్కారం ఉందని అధ్యయనంలో తేల్చారు. కూరగాయలు, ఆకుకూరలతో పాటు పండ్లు, పప్పు దినుసుల వంటి వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దరి చేరవని కనుగొన్నారు.  

 ప్రొటీన్ ఎక్కువ బీ12 తక్కువ వెజ్ ఫుడ్ తినేవారిలో ప్రొటీన్ ఇన్​టేక్ బాగా ఉంటున్నట్టు వెల్లడైంది. క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సీ వంటివి అధికంగా వెజిటేరియన్ ఫుడ్స్ నుంచి లభిస్తున్నట్టు సైంటిస్టులు గుర్తించారు. అయి తే, వెజిటేరియన్లలో విటమిన్​ బీ12 లోపం మాత్రం కనిపిస్తున్నట్టు తేల్చారు. మాంసం, చేపలు తినేవారిలో కార్బొహైడ్రేట్స్, సోడియం, రైబోఫ్లేవిన్, ఐరన్, విటమిన్  బీ12 ఇన్ టేక్ ఎక్కువగా ఉంటున్నట్టు నిర్ధారణకు వచ్చారు.  

 మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో ప్రొటీన్ ఇన్​టేక్ ఎక్కువగా ఉంటుండడం వల్లే వారి మెదడు ఆరోగ్యం మంచిగా ఉంటున్నట్టు సైంటిస్టులు గుర్తించారు. అంతేగాకుండా మాంసాహారులతో పోలిస్తే వెజిటేరియన్లలోనే రక్తంలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటున్నట్టు తేల్చారు. దాని వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిపోయి డిప్రెషన్, యాంగ్జైటీ వంటివి దూరం అవుతున్నాయని గుర్తించారు. వీరి రీసెర్చ్ వివరాలు ఇటీవల ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’లో ప్రచురితం అయ్యాయి.

Hyderabad Focal College (HCU) specialists say whether you need to dispose of sadness, further develop your cerebrum wellbeing or keep a positive state of mind, you ought to eat veggie lover food. Minds are a lot better in vegans contrasted with non-veggie lovers As of late, it has been uncovered in a review directed by a group drove by Colleague Teacher Dr. Varalakshmi Manchana of the School of Clinical Sciences at HCU that side effects, for example, sorrow and uneasiness don't happen.

 They arrived at this resolution in the wake of concentrating on the dietary patterns of 304 individuals more than 40 years old for quite a long time on their mind wellbeing. Besides, the review reasoned that the maturing qualities are likewise dialed back in vegans, and thus, there is an opportunity for maturing skin to seem a little later in them. It has been tracked down that including vegetables and greens alongside foods grown from the ground in the day to day diet doesn't prompt medical conditions.

 It has been uncovered that protein admission is better in the people who eat protein rich B12 low veg food. Researchers have tracked down that calcium, folic corrosive and L-ascorbic acid are richly accessible from vegan food varieties. Notwithstanding, it was reasoned that lack of vitamin B12 is found in veggie lovers. It was reasoned that the admission of sugars, sodium, riboflavin, iron and vitamin B12 is higher in meat and fish eaters.

 Researchers have found that vegans have better mind wellbeing because of their higher protein admission contrasted with meat eaters. Also, it was reasoned that vegans have more cell reinforcements in their blood contrasted with non-veggie lovers. It has been observed that oxidative pressure is decreased and sadness and uneasiness are taken out. Their examination subtleties were as of late distributed in the 'European Diary of Sustenance.

మరిన్ని వార్తల కోసం.... 
* డ్రైఫ్రూట్స్ తింటే 5ఆరోగ్యకర లాభాలు ఇక్కడ క్లిక్ చేయండి
* సీఎం రేవంత్కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క ఇక్కడ క్లిక్ చేయండి
* రాఖీ పండుగ రోజు ఆకాశంలో అద్భుతం అది ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయండి
* పొట్టే కదా అని పారేస్తున్నారా ఇందులో ఎన్నో పోషకాలున్నాయి ఇక్కడ క్లిక్ చేయండి
* ఆస్పత్రిలో అన్న తమ్ముడికి రాఖీ కట్టి ప్రాణాలు వదిలిన చెల్లెలు ఇక్కడ క్లిక్ చేయండి
* దేశవ్యాప్తంగా భారీ వర్ష సూచన పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఇక్కడ క్లిక్ చేయండి
* భవిష్యత్తులో రోజుకు 25 గంటలు భూమిపై వెన్నెల రాత్రులు ఉండవా ఇక్కడ క్లిక్ చేయండి
* గ్యాస్​ సమస్యతో బాధ పడుతున్నారా అయితే వీటికి దూరంగా ఉండండి ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies