మైట్రో స్టేషన్లు కిటకిట రైలు ఎక్కటానికే ఇబ్బందులు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ సిటీలో వర్ష బీభత్సం ఎఫెక్ట్ ట్రాఫిక్ పై పడింది. రోడ్లపై నీళ్లు నిలవటంతో ట్రాఫిక్ జాం ఉంది. దీంతో ప్రయాణికులు అందరూ మెట్రో వైపు వెళ్లారు మామూలుగానే రెగ్యులర్ గా ఉదయం సమయంలో మెట్రో రైళ్లు కిటకిటలాడతాయి అలాంటిది రోజు వారీ కంటే అదనంగా వేలాది మంది ఒక్కసారిగా మెట్రో స్టేషన్లకు రావటంతో కిటకిటలాడుతున్నాయి.
సిటీ వ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో స్టేషన్లలోనూ రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ ఉంది. అదే విధంగా ఆన్ లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకుని ఫ్లాట్ ఫాంకు చేరుకుంటున్నారు ప్రయాణికులు. ఈ క్రమంలోనే రైలు ఎక్కేందుకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అమీర్ పేట, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, హైటెక్ సిటీ, ఉప్పల్ మెట్రో స్టేషన్లు అయితే తిరనాళ్ల జాతర ఉన్నట్లు ఉన్నారు ప్రయాణికులు.
మెట్రోస్టేషన్లలో ఒక్కసారిగా పెరిగిన రద్దీతో రైలు ఎక్కాలంటే స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. రెండు, మూడు రైళ్లకు ఆగితేనే ఎక్కగలుగుతున్నారు. ప్రతి మూడు నిమిషాలకు ఓ సర్వీస్ నడుస్తుంది ట్రాఫిక్ జాం, వర్షాలతో ప్రయాణికులు పెరగటంతో రైళ్లు సరిపోవటం లేదు. సర్వీసులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. వర్షాలు, ట్రాఫిక్ జాం వల్ల రెగ్యులర్ గా బైక్స్, కార్లలో వెళ్లే వేలాది మంది ఇప్పుడు మెట్రో వైపు రావటంతో రష్ పెరిగింది అంటున్నారు మెట్రో అధికారులు.
In Hyderabad city, the effect of rain disaster has fallen on the traffic. There is a traffic jam due to standing water on the roads. As a result, all the passengers went towards the metro. As usual, the metro trains are jammed regularly in the morning, as more than thousands of people are coming to the metro stations at once.
The traffic has increased tremendously in all metro stations across the city. There is a queue near the ticket counters. In the same way, passengers book tickets online and reach the platform. In this order, there are situations where you have to wait to board the train. Ameer Peta, Kukat Pally Housing Board, LB Nagar, Dil Sukh Nagar, Hi-Tech City, Uppal Metro Stations but the Tiranalla Fair are the most frequented by commuters.
With the sudden increase in traffic in the metro stations, there is no space to board the train. They are able to board only if they stop for two or three trains. A service runs every three minutes. Traffic jams and rains have increased the number of passengers and there are not enough trains. Passengers are demanding to increase services. Metro officials say that the rush has increased as thousands of people who regularly travel by bikes and cars have come towards the metro due to rains and traffic jams.