ఎలాంటి ప్లేట్ లో అన్నం తినాలో తెలుసా
ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : ఒకప్పుడు బాగా డబ్బులున్న వాళ్లింట్లో బంగారు, వెండి పళ్లాలు, చెంబులు ఉంటే అటుఇటుగా ఉన్న వాళ్లింట్లో ఇత్తడి, రాగి పళ్లాలు, చెంబులు ఉండేవి. వాటిలోనే అన్నం తిని, నీళ్లు త్రాగి. ఆరోగ్యంగా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరింట్లో చూసినా ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు అన్ని ప్లాస్టిక్, అల్యూమినియంతో తయారు చేసినవే. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయవు. పైగా కొత్తరోగాలను తెచ్చిపెడతాయి.
ప్లాస్టిక్, స్టీల్, అల్యూమినియం పళ్లాల్లో జైస్పే నాల్ ఏ (బీపీఏ) పాలేట్స్ లాంటి రసాయనాలుంటాయి. వాటి కారణంగానే ఆహారం విషంగా మారుతోంది. ఇలా ప్లాస్టిక్ మీద ఆధారపడటం పెరిగే కొద్దీ ఈ స్లో పాయిజన్ వేగంగా వ్యాప్తి చెంది ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీటిని వదిలి హాని చేయని పళ్లాల్లో తినాలంటున్నారు నిపుణులు. ఏ పళ్లెంలో తింటే ఏం లాభాలో పూర్వకాలంనాటి వైద్య గ్రంథాల్లో స్పష్టంగా ఉంది. అవేంటో తెలుసుకుని మనకు అందబాటులో ఉన్న వాటిలో ఉంటే పోలా
బంగారు పళ్లెం: ఇందులో తింటే సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు బంగారు పళ్లెంలో తినాలంటారు పెద్దలు.
వెండి పళ్లెం: వీటిలో భోజనం చేసినా ఆనందంగా ఉంటారు. శరీరంలోని వేడి తగ్గుతుంది. కానీ ఇవి కొందరికి కఫ, వాత సమస్యలను తెచ్చిపెడతాయి
కంచు పళ్లెం: కందు పళ్లెంలో భోజనం రుచిగా ఉండటమే కాదు. ఆరోగ్యానికి మేలు చేస్తుంది అతిసార వ్యాధులతో బాధపడే వాళ్లకి బీపీ, గుండె జబ్బులు వాళ్లకి బంగారు పళ్లెం తర్వాత ఎక్కువ మేలు చేసేది కంచు పళ్లెమే.
రాతి గిన్నెలు, మట్టి మూకుళ్లు: వీటిలో భోజనం చేయడం వల్ల ఎలాంటి ప్రమా దాలు ఉండవు పాత రోజుల్లో మట్టి కుండలో. అన్నం వండుకుని, మూకుళ్లలో కూరని నిల్వ చేసేవారు. మట్టి గిన్నెల్లో తోడుపెట్టిన పెరుగు రుచిగా ఉంటుంది. రాతి గిన్నెలో పులుసు. పప్పు చారు కాచేవాళ్లు. అందుకే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండేది. లోహపు గిన్నెల్లో పులుపు. కూరలు వండటం మంచిది కాదు.
విస్తరాకులు: ఒకప్పుడు మోదుగాకులతో చేసిన విస్తరాకుల్లో తినేవాళ్లు. వాటితోపాటు అరిటాకుల్లో తినడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న విస్తరాకులు మంచివి కావు. అడుగు భాగంలో పేపర్ ఉన్నప్పటికీ, పైన మాత్రం లామినేషన్ షీట్లు ఇంటిస్తున్నారు. వీటివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
సిరామిక్ పళ్లెం : ప్లాస్టిక్ తో పోల్చినప్పుడు సెరామిక్ (పింగాణీ) పళ్లాలు చాలా వరకూ నయం అని చెప్పాలి. ఒకప్పుడు దర్జా, హోదా దర్భాలను చాటుకోవడానికి ఈ సెరామిక్ పళ్లాలు బాగా ఉపయోగపడేవి. ఇప్పటికీ సెరామిక్ గాజు పళ్లాలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. వీటితో ఎలాంటి సమస్యలు రావు.
రాగి పళ్లెం : రాగి పళ్లెంలో భోజనం చేయుడని పెద్దలు చెప్తారు. కానీ రాగి గ్రాసులో నీళ్లు తాగితే మంచిది. అందులోని యాంటి ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
Once the rich people had gold and silver plates and stones, but the poor people had brass and copper plates and stones. Eat rice and drink water in them. They were healthy. But now. The situation has completely changed. No matter who you look at, plates, glasses and bowls are all made of plastic and aluminum. These are not good for health. Moreover, they bring new diseases.
Plastic, steel, and aluminum teeth contain chemicals like zaspa nal A (BPA) pallets. It is because of them that the food is becoming poisonous. As dependence on plastic increases, there are chances that this slow poison will spread rapidly and become a danger. That's why experts want to leave them and eat them in harmless teeth. It is clear in ancient medical texts about the benefits of eating on any plate. Knowing that, it's not like we have it in our reach.