ప్రతి పూజలో శుభకార్యాల్లో మామిడిఆకులను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఏ పూజ తలపెట్టినా ఎలాంటి శుభకార్యము చేస్తున్నా హిందువులు కచ్చితంగా మామిడి ఆకులు వాడతారు. ఇంటి ముందు మామిడి ఆకులు తోరణాలుగా కడతారు. ఈ ఆచారం సత్యయుగం నుంచి వస్తుంది. అసలు మామిడి ఆకులకు శుభకార్యాలకు ఉన్న సంబంధం ఏమిటి ఏ ఆకుకు లేని ప్రాధాన్యత హిందువులు మామిడి ఆకుకు ఎందుకు ఇచ్చారు పురాణాల్లో మామిడి ఆకు గురించి ఏముందో తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయం ప్రకారం మామిడి ఆకులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. పూజలో తప్పనిసరిగా మామిడాకులు ఉపయోగిస్తారు. అలాగే హిందూ మతంలో చెట్లు, మొక్కలను పూజిస్తారు. ఎందుకంటే వాటిల్లో దేవతలు, దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు. మామిడి ఆకులతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు పొందుతారు. అలాగే జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా పూజలో మామిడి చెట్టు కలప, ఆకులను ఉపయోగించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాస్తు శాస్త్ర ప్రకారం కూడా మామిడి ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వీటితో కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే అన్ని బాధలు, సమస్యలు తొలగిపోతాయని ఆనందం, అదృష్టం వస్తాయని నమ్ముతారు. ఈ పరిహారాలు ఒక వ్యక్తి జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తాయి. జీవితంలో సంపద, ఆనందాన్ని తీసుకొస్తాయి.
శుభకార్యాలలో మామిడి ఆకులు
మామిడి చెట్టు ఆకులు ను మహాలక్ష్మీ దేవి, ప్రేమతో సంబంధం కలిగి ఉంటుంది. మామిడి ఆకులు సంతానోత్పత్తికి చిహ్నంగా భావిస్తారు. మన్మథుడితో కూడా సంబంధం కలిగి ఉంటుంది. శుభ కార్యాలలో మామిడి ఆకులు ఉపయోగిస్తే విజయం, ఆనందం, శాంతి నెలకొంటాయి. ఇవి అంగారక గ్రహంతో ముడిపడి ఉంటాయని చెబుతారు.
ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే మామిడి ఆకులతో ఈ పరిహారం చేయండి. మీ నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందేందుకు, డబ్బు కొరత అధిగమించేందుకు మామిడి ఆకుల కొమ్మను 11 సార్లు పచ్చి నూలుతో చుట్టి తేనెలో ముంచి శివుడికి అభిషేకం చేయాలి. తేనెలో ముంచిన భాగం శివలింగానికి ఎదురుగా ఉండాలని గుర్తుంచుకోండి. ఈ చర్యలు తీసుకోవడం వల్ల ధన కొరత తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్ముతారు.
పండుగలు వచ్చాయంటే తప్పనిసరిగా ఇంటి గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కట్టుకుంటారు. ఇంటి ప్రధాన ద్వారం మొత్తం మామిడి ఆకుల తోరణాన్ని ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు ఎవరి మీద చెడు కన్ను పడదు. ఇంట్లో సానుకూలత, శుభకార్యాలకు ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతాయి. సంతోషం, శ్రేయస్సు ఇంట్లో ఎప్పుడూ నిలిచి ఉంటాయి.
వాస్తు ప్రకారం పూజ చేసేటప్పుడు మామిడి ఆకులతో నీటిని చల్లడం వల్ల డబ్బు కొరత తొలగిపోతుంది. సంపద ప్రయోజనాలు కలుగుతాయి.
వినాయకుడికి మామిడి ఆకులు వాస్తు ప్రకారం శుభకార్యాలలో వినాయకుడికి మామిడి ఆకులని సమర్పించడం వల్ల వ్యక్తి జీవితంలో సంతోషానికి ఎప్పుడూ లోటు ఉండదు. అలాగే ఇంట్లో సంపద శ్రేయస్సు లభిస్తుంది. పూజ సమయంలో ఇంట్లో ఉన్న పూజగదిని మామిడి ఆకులతో అలంకరించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది.
వృత్తిలో ఆటంకాలు ఎదుర్కోలేకపోతున్నారా అయితే మామిడి ఆకులతో ఈ పరిహారం పాటించి చూడండి. మీ వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది. మామిడి చెట్టు వేళ్ళపై నీరు పోసి మామిడి చెట్టుకి నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల కెరీర్ కు సంబంధించిన సమస్యలు తొలగిపోయి విజయమార్గాలు తెరుచుకుంటాయి. వృత్తిలో ఆటంకాలు తొలగిపోతాయి.
Hindus use mango leaves for any auspicious work. In front of the house mango leaves are washed as arches. This practice comes from Satya Yuga. What is the relation of real mango leaves with auspicious deeds? Why did Hindus give priority to mango leaves, let's know what is about mango leaves in Puranas.
According to Hindu tradition, mango leaves are given special importance. Mangoes must be used in puja. Also trees and plants are worshiped in Hinduism. Because it is believed that gods and goddesses reside in them. Doing some remedies with mango leaves brings happiness and prosperity. Scholars also say that obstacles in life will be removed.
Especially the use of mango tree wood and leaves in puja is considered very sacred. According to Vastu Shastra too, mango leaves are very important. It is believed that if some special remedies are done with these, all sufferings and problems will be removed and happiness and luck will come. These remedies remove all obstacles in a person's life. Brings wealth and happiness in life.