ఈ నెలాఖరులో DSC రిజల్ట్స్
* వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో మెరిట్ లిస్ట్
* సెకండ్ వీక్‌లో 1:3 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : డీఎస్సీ ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 13న రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రిలిమినరీ కీని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటలతో అభ్యంతరాల స్వీకరణ ముగియనుంది. అభ్యంతరాలపై సబ్జెక్టు ఎక్స్ పర్ట్ కమిటీ సమీక్షించి, ఈ నెలాఖరులోనే ఫైనల్ కీ, ఆ వెంటనే రిజల్ట్స్ విడుదల చేసే చాన్స్ ఉంది. వచ్చేనెల మొదటివారంలో జిల్లాల వారీగా పోస్టులు, వివిధ మీడియంలలో మెరిట్ లిస్టులు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తున్నది.
డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు 1:3 రేషియాలో వచ్చే నెల రెండోవారంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, పండిట్, పీఈటీ కేటగిరీలో ఒక్కోపోస్టుకు ముగ్గురుచొప్పున సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు పిలుస్తారు. గత నెల19న ఫస్ట్ షిఫ్ట్‌లో జరిగిన ఎస్జీటీ తెలుగు మీడియం పరీక్షలో, అదే నెల23న సెకండ్ షిఫ్ట్‌లో జరిగిన ఎస్జీటీ తెలుగు మీడియం పరీక్షలో సోషల్ సబ్జెక్టులోని ప్రశ్నలన్నీ ఒకేరకంగా ఉన్నాయి.
అయితే, ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఇబ్బందులు ఏమీ ఉండవని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. పక్కపక్కన జిల్లాలకూ వేర్వేరు రోజుల్లో జరగడంతో కలిసి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు క్వశ్చన్లు తెలిసే చాన్స్ ఉంది. అయితే, జిల్లాలు వేర్వేరు కావడంతో పాటు పేపర్ బయటకు రాదు కాబట్టి సమస్య ఏమీ ఉండదని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్తున్నారు.
The Education Department has taken steps to release the DSC results at the end of this month. 2.45 lakh people appeared for the recently conducted DSC examinations for filling 11,062 teacher posts in the state. On 13th of this month, the school education authorities released the preliminary key along with the response sheets. Tuesday with 5 p.m Acceptance of objections will end. There is a chance that the subject expert committee will review the objections and release the final key by the end of this month and the results immediately. It is known that in the first week of next month, district wise posts and merit lists will be released in various mediums.
Officials are making arrangements to carry out the process of verification of certificates in the second week of next month in 1:3 ratio for merit candidates in DSC. Three candidates for each post in School Assistant, SGT, Pandit, PET category will be called for verification of certificates. In the SGT Telugu Medium exam held in the first shift on 19th of last month and in the SGT Telugu Medium exam held in the second shift on 23rd of the same month, all the questions in the social subject were the same.
However, the education department officials say that there will be no problems as the exams are online. Candidates preparing together have a chance to know the questions as they are held on different days for adjacent districts. However, the school education officials say that there is no problem as the districts are different and the paper does not come out.