మటన్ తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కాని ఇలాంటి వారు తినకూడదట
ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : మటన్ అంటే చాలా మంది లొట్టలేసుకుంటారు. మటన్ తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలామందికి మటన్ తినడం మంచిదేనా కాదా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది మటన్ తినడం మంచిది కాదని, రెడ్ మీట్ ఆరోగ్యానికి హానికరమని చెబుతారు. అయితే ఈ రెండు వాదనలలో ఏది కరెక్ట్ మటన్ తినడం మంచిదేనా అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మటన్ లో ఉండే పోషకాలివే....
మటన్ లో బి 1, బి 2, బి 3, ,బీ6,బీ 12 విటమిన్ లు ఉంటాయి. విటమిన్ ఈ, విటమిన్ కె, సహజమైన ఫ్యాట్స్ తో పాటు కొలెస్ట్రాల్, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, జింక్, ఫాస్ఫరస్, కాపర్, సెలీనియం, అమైనోయాసిడ్స్, ప్రోటీన్లు ,న్యూట్రియంట్లు ఉంటాయి.
మటన్ తింటే ఈ సమస్యల నుండి ఊరట....
మటన్ లో ఉండే బి కాంప్లెక్స్, సెలీనియం, కొలైన్ వంటివి క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని కాపాడతాయి. మటన్ మనలను అధిక రక్తపోటు నుండి హార్ట్ స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే పొటాషియం అందుకు దోహదం చేస్తుంది. మటన్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. మటన్ తినడం కారణంగా ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
వీళ్ళు మటన్ తినకూడదు....
కొంతమందికి మటన్ తినడం ఏమాత్రం మంచిది కాదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు మటన్ తినడం ఏ మాత్రం మంచిది కాదు. దీనివలన చెడు కొలెస్ట్రాల్ మరింత పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విపరీతంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ట్రైగ్లీజరైడ్స్ సమస్య ఉన్నవారు మటన్ తినకుండా ఉండాలి.
Mutton is something that many people are afraid of. Medical experts say that eating mutton has many health benefits. But many people have different opinions about whether it is good to eat mutton or not. Some people say that eating mutton is not good and red meat is bad for health. But now let us find out which of these two arguments is better to eat correct mutton.
They should not eat mutton.
For some people eating mutton is not good at all. Eating mutton is not good for those who have bad cholesterol in their body. This can increase bad cholesterol and lead to heart problems. So those who have bad cholesterol in the body excessively and those who have triglycerides problem should avoid eating mutton.