Type Here to Get Search Results !

Sports Ad

మంచి ఆరోగ్యం బరువు తగ్గటానికి ఈ డైట్ మంచిదేనా Great Wellbeing: Is This Diet Really Great For Weight Reduction

 మంచి ఆరోగ్యం బరువు తగ్గటానికి ఈ డైట్ మంచిదేనా

జాతీయ National News భారత్ ప్రతినిధి : బరువు తగ్గడానికి ఒక్కొక్కరు ఒక్కో డైట్ ఫాలో అవుతారు. దానికి తగ్గట్టే రోజుకో కొత్త డైట్ పుట్టుకొస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్న మరో డైట్ 'కేంబ్రిడ్జి డైట్'. ఈ డైట్ ఫాలో అవుతూ కేజీలు కేజీలు బరువు తగ్గుతున్నారు చాలామంది. అసలు ఆ డైట్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. 

మనం ఎంత  హెల్దీగా ఉన్నామో చెప్పే మెజర్​ మెంట్స్​ లో  బాడీ మాస్ ఇండెక్స్ (బీయంఐ) కూడా ఒకటి. ఎత్తు, బరువు కొలతలను బట్టి ఆ వ్యక్తి ఎంత ఆరోగ్యంగా లేదా అనారోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఇరవై దాటాక ఎత్తు మారదు మారేదల్లా బరువు ఒక్కటే. అందుకే దానిపై కంట్రోల్ ఉంటే ఆటోమేటిక్​గా హెల్దీగా ఉన్నట్టే. బరువు. పెరగటం సులువే. క్యాలరీలు ఎక్కువగా ఉన్న కార్బొహైడ్రేట్ ఆహారం తింటే సరిపోతుంది. కానీ బరువు తగ్గడానికే నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఉన్నట్టుండి కార్బొహైడ్రేట్లను తీసుకోవటం మానేయలేం. అలా చేస్తే రక్తపోటు తగ్గిపోవటమే కాదు, చాలా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే బరువు తగ్గాలంటే సరైన ఆహార నియమాలు పాటించడం ఒక్కటే మార్గం. దానికోసమే ఈ డైట్లు.

ఈ డైట్లో.... 
 కేంబ్రిడ్జి డైట్ గురించి సింపుల్​ గా  చెప్పాలంటే ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చాలా వేగంగా బరువు తగ్గించే ఒక విధానం. ఇక్కడ బరువు తగ్గాలనుకుంటున్న వ్యక్తికి పోషకాలు కావాల్సినంత మొత్తాలలో అందిస్తారు. కాకపోతే అది డైరెక్ట్​గా ఇవ్వకుండా సూప్స్, షేక్స్ రూపంలో ఇస్తారు. వాటి సాయంతో న్యూట్రిషన్స్, ప్రొటీన్స్ సరైన మోతాదులో అందేలా చూస్తారు. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లు మీల్స్ కి బదులు డాక్టర్లు సూచించిన సూప్స్, షేక్స్ తీసుకుంటారు. బరువుని బట్టి ఇందులో ఆరు రకాల డైట్ ప్లాను ఉంటాయి. వీటిద్వారా రోజుకు 415 క్యాలరీల నుంచి 1500 క్యాలరీల వరకు కరిగించుకోవచ్చు

ఇలా పనిచేస్తుంది.... 
 ఈ డైట్ ఎవరు పడితే వాళ్లు ఇంట్లో ఫాలో అయిపోయే డైట్ కాదు. వ్యక్తిబరువు, హెల్త్ కండిషన్ని బట్టి డైట్ చార్ట్​ ను  డైట్ స్పెషలిస్టులు
తయారు చేస్తారు. ఈ డైట్ పాటిస్తూ, ముందుకెళ్తున్నకొద్దీ స్పెషలిస్టు మార్పులు చేస్తూ ఉంటారు. బరువు తగ్గే ప్రాసెస్​ లో  శరీరం పోషకాలను కోల్పోకుండా, తగిన పోషకాలు అందే విధంగా స్పెషలిస్టులు కేర్ తీసుకుంటారు.

మనదేశంలో కూడా.... 
 ఈ కేంబ్రిడ్జ్ రైట్ మనదేశంలో కూడా ఉంది. 1970లో డాక్టర్ అలాన్ హోవర్డ్ మొదటిసారి దీన్ని ప్రవేశపెట్టారు. నిజానికి మనదేశ ఆహార పద్ధతులకి ఈ డైట్ చాలా చక్కగా సరిపోతుంది. ఎందుకంటే మనదేశంలో అన్నం రోటీలు ఎక్కువ మంది తింటారు. ఈ రెండింటిలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే చాలామంది ఎంత ట్రై చేసినా బరువు తగ్గలేరు. 2018 నాటికి, కేంబ్రిడ్జ్ డైట్ ఐఎంఎ రికమండేషన్స్ ప్రకారం ఈ డైట్ మనకి కూడా బాగా సరిపోయింది. అయితే ఇది ఎంత వరకు సేఫ్ అనేది కొంతమంది డౌట్.

మంచిదేనా.... 
 ఒక వ్యక్తికి, రోజువారీ క్యాలరీలు తీసుకోవడం తగ్గితే, శరీరంపై వెంటనే ఏదో ప్రభావం పడుతుంది. సైడ్ ఎఫెక్ట్ వచ్చి మత్తుగా ఉండటం, నిద్రలేమి వంటివి ఉంటాయని కొంతమంది అభిప్రాయం. అయితే కేంబ్రిడ్జ్ మాత్రం ఈ డైట్ కి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయని చెప్తుంది. ఈడైట్​ ను  ఎక్కువ రోజులు పాటించకూడదు. రోజుకి వెయ్యి క్యాలరీల కన్నా తక్కువ ఆహారం. వరసగా 12 రోజులకి మించి తినకూడదు. అన్నింటికన్నా ముఖ్యం. ఈ డైట్ స్పెషలిస్టుల ఆధ్వర్యంలోనే పాటించాలి. ఎలాంటి మార్పులొచ్చినా వాళ్లు చూస్తారు. కాబట్టి సేఫ్టీ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని డైటీషియన్లు చెప్తున్నారు.

Everybody follows an alternate eating regimen to get thinner. Another eating routine is arising consistently. Another eating regimen that has become exceptionally famous lately is the 'Cambridge Diet'. Following this eating routine, many individuals are losing kg by kg. We should figure out why is that diet unique.

 Weight Record (BMI) is additionally one of the estimations that tell how sound we are. Level and weight estimations can perceive how solid or undesirable an individual is. Level doesn't change for anybody after twenty, just weight changes. Hence, assuming that there is command ready to be done, it is naturally sound. weight Simple to develop. Eating a fatty starch diet is sufficient. However, to shed pounds, you need to go through a great difficult situation. Consuming carbs as they are can't quit Doing so won't just decrease pulse yet additionally objective numerous medical issues. That is the reason legitimate eating regimen is the best way to get in shape. That is the thing these weight control plans are for.

It works like this….

This diet is not a diet that anyone can follow at home. Diet specialists make diet chart according to individual weight and health conditionare made. Following this diet, the specialist will make changes as you progress. In the process of losing weight, specialists take care so that the body does not lose nutrients and gets adequate nutrients.

మరిన్ని వార్తల కోసం....
* బంగ్లాదేశ్ గతం వర్తమానం ఇక్కడ క్లిక్ చేయండి 
* స్వదేశానికి ఇండియా హాకీ టీమ్ ఇక్కడ క్లిక్ చేయండి 
* 100 ఏళ్లు బతకాలంటే వీటిని పాటించండి ఇక్కడ క్లిక్ చేయండి 
* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రతిపాదనలు ఇక్కడ క్లిక్ చేయండి 
* వర్షాకాలం ముసురు పట్టిన వేళలో హాయి హాయిగా ఇక్కడ క్లిక్ చేయండి 
* మంచి ఆరోగ్యం బరువు తగ్గటానికి ఈ డైట్ మంచిదేనా ఇక్కడ క్లిక్ చేయండి 
* అరటిపండు తింటే కలిగే 5 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies