బ్యాంక్ డిపాజిట్లలో సగం సీనియర్ సిటిజన్స్‌వే
జాతీయ National News భారత్ ప్రతినిధి : బ్యాంకుల దగ్గరున్న మొత్తం టర్మ్ డిపాజిట్లలో సగం వాటా సీనియర్ సిటిజన్లకు చెందినవని ఎస్‌బీఐ ఎకనామిస్ట్‌లు పేర్కొన్నారు. యువత ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అసెట్స్ వైపు చూస్తున్నారని అన్నారు. డిపాజిట్లకు సంబంధించి ట్యాక్స్ విధానాల్లో మార్పు రావాలని, అప్పుడే బ్యాంకులు క్రెడిట్ గ్రోత్ మరింతగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎస్‌బీఐ రిపోర్ట్ ప్రకారం, 2021–22 ఆర్థిక సంవత్సరం తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.61 లక్షల కోట్లు పెరిగాయి.
ఇదే టైమ్‌లో బ్యాంకులిచ్చిన అప్పులు రూ.59 లక్షల కోట్లుగా ఉన్నాయి. అప్పుల గ్రోత్‌కు తగ్గట్టు డిపాజిట్ల గ్రోత్ లేదనడం అవాస్తవం. బ్యాంకులిస్తున్న అప్పులు పెరుగుతున్నంత వేగంగా ఇవి సేకరించే డిపాజిట్లు పెరగడం లేదని గత ఏడాది కాలంగా ఆందోళనలు పెరిగాయి. దీంతో బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించడానికి వడ్డీని పెంచుతున్నాయి. ఫలితంగా వీటి లాభాలు తగ్గే ఛాన్స్ ఉంది. 2022–23, 2023–24 లో మాత్రం అప్పులు పెరిగినంతగా, డిపాజిట్లు పెరగలేదని ఎస్‌బీఐ రిపోర్ట్ పేర్కొంది.
డిపాజిట్లు రూ.24.3 లక్షల కోట్లు పెరిగితే, బ్యాంకులు రూ.27.5 లక్షల కోట్ల అప్పులిచ్చాయి. వరుసగా 26వ నెలలోనూ బ్యాంకుల డిపాజిట్ల గ్రోత్ నెమ్మదిగా ఉందని ఎస్‌బీఐ రిపోర్ట్ పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ – అక్టోబర్ నాటికి క్రెడిట్ గ్రోత్ నెమ్మదిస్తుందని అంచనా వేసింది. అంతేకాకుండా కొత్త రూల్స్‌తో బ్యాంకులు లిక్విడిటీ నిల్వలను పెంచాల్సి ఉంటుంది. దీంతో షార్ట్ టెర్మ్‌లో క్రెడిట్ గ్రోత్ తగ్గే ఛాన్స్ ఉందని పేర్కొంది.
SBI economists stated that half of the total term deposits with banks belong to senior citizens. He said that the youth are looking towards assets that give higher returns. Banks are of the opinion that there should be a change in the tax policies regarding deposits, only then will the credit growth increase further. According to the SBI report, after the financial year 2021-22, deposits in banks have increased by Rs 61 lakh crore.
During the same time, the loans given by the bank are Rs. 59 lakh crores. It is not true that there is no growth of deposits to match the growth of loans. Over the past year, there have been concerns that the deposits collected by the banks are not growing as fast as the loans being made by them. As a result, banks increase interest to attract deposits. As a result, there is a chance that their profits will decrease. The SBI report stated that in 2022-23 and 2023-24, as much as the loans increased, the deposits did not increase.
Deposits increased by Rs 24.3 lakh crore, while banks lent Rs 27.5 lakh crore. The SBI report stated that the growth of bank deposits has been slow for the 26th consecutive month. Credit growth is expected to slow down by June-October next year. Moreover, the new rules will require banks to increase their liquidity reserves. With this, there is a chance of reducing credit growth in the short term.