రాజీనామా చెయ్ సికింద్రాబాద్లో హరీష్ రావు ఫ్లెక్సీల కలకలం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పంట రుణాలు మాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంతో హరీశ్ రావు రాజీనామా చేయాలని సికింద్రాబాద్లో ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కొందరు హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు.
'దమ్ముంటే రాజీనామా చెయ్రుణ మాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అగ్గిపెట్ట హరీశ్ రావు' అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేసి చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధం అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సవాల్ను గుర్తుచేస్తూ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజకీయంగా హరీష్ రాజీనామా ఛాలెంజ్ మరోసారి చర్చనీయాంశమైంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హరీష్ రాజీనామా సవాల్పై తాజాగా విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా వైరా సభలో మాజీ మంత్రి హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు. చీము నెత్తురు, సిగ్గు శరం ఉంటే హరీశ్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. హరీశ్ రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ విరగడ అవుతుందని ధ్వజమెత్తారు. ఒకవేళ రాజీనామా చెయ్యకపోతే అమరుల స్థూపం దగ్గర హరీష్ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.
There were reports in Secunderabad that Harish Rao ought to leave in the wake of satisfying the commitment given by the Congress government by postponing the harvest credits. Flexi on BRS MLA Harish Rao is drumming up some excitement. Short-term, certain individuals coordinated flexi for the sake of enthusiasts of Malkajigiri previous MLA Mainampalli Hanumantha Rao and requested the acquiescence of Harish Rao.
"Leave if you truly think it wise.. Your renunciation will bring about a credit waiver, Aggipetta Harish Rao" has been set up in many spots including Secunderabad, Patni, Heaven, Rasul Pura, Begumpet, Panjagutta. 2 lakh complete advance waiver for all ranchers in the state till August 15 It is realized that BRS chief Harish Rao had recently declared that he is prepared to leave assuming it is carried out. Once more the test of Harish's renunciation has turned into a subject of conversation as flexi were coordinated in the city to help them to remember this test.
Telangana CM Revanth Reddy likewise as of late censured the test of Harish's renunciation. CM Revanth Reddy tested previous pastor Harish Rao in the Vaira Sabha of Khammam area. As indicated by the word given by Rahul Gandhi, two lakhs of advance has been deferred off. Harish Rao needs to leave his post as a MLA in the event that there is discharge and blood. Assuming Harish leaves It was guaranteed that the enduring of Siddipet will be broken. On the off chance that he doesn't leave, CM Revanth requested that Harish ought to compose his nose on the ground close to Amarula Stupa and apologize to individuals.